amp pages | Sakshi

అయ్యో.. ఐఫోన్‌ అందకపాయె..! 

Published on Sat, 12/19/2020 - 07:01

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఆపిల్‌ ఐఫోన్‌ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఐఫోన్‌ కొనుగోళ్లపై స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు మునిసిపల్‌ పరిపాలనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి స్టాండింగ్‌ కమిటీ నిర్ణయాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ంఎసీ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు 15 మందితోపాటు మేయర్, డిప్యూటీ మేయర్‌లకు, ముగ్గురు అధికారులకు కూడా ఐఫోన్లు (12 ప్రోమాక్స్‌ మోడల్‌–512 జీబీ డేటా) కానుకగా అందజేసేందుకు గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది నగరంలోని వివిధ వర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో, ప్రభుత్వం శుక్రవారం ఈనిర్ణయం తీసుకుంది. చదవండిగూగుల్, ఫేస్‌బుక్‌లతో ఆదాయం పంచుకోవాలి 

గతంలో జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ ఆమోదం పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని  ప్రతియేటా స్టాండింగ్‌ కమిటీ సభ్యులకు ల్యాప్‌టాప్‌లు/ట్యాబ్‌లు తదితరమైనవి బహుమతులుగా అందజేయడం ఆనవాయితీగా ఉండేదని పేర్కొంటూ అదే తరహాలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2020–21) బడ్జెట్‌ ఆమోదం పొందిన సందర్భంగా  స్టాండింగ్‌ కమిటీ సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్‌లకు అందజేసేందుకు స్టాండింగ్‌ కమిటీలో ఆమోదం తెలిపారు. దాంతో పాటు మేయర్‌ ఐదేళ్ల పదవీకాలం విజయవంతంగా పూర్తయిన సందర్భంగా  మేయర్‌ కార్యాలయంలోని ముగ్గురు సీనియర్‌ అధికారులకు కూడా ఈ ఫోన్లు అందజేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ అంశం నగరంలో చర్చనీయాంశంగా మారడంతో కొనుగోళ్ల నిర్ణయాన్ని నిలిపివేశారు. ఈ ఐఫోన్ల విలువ ఒక్కొక్కటి దాదాపు రూ. 1.60 లక్షలు వంతున  మొత్తం 20 ఫోన్లకయ్యే వ్యయం దాదాపు రూ. 32 లక్షలు. కార్పొరేటర్లకు కానుకలపై  గతంలో ఒకసారి హైకోర్టులో పిల్‌  దాఖలు కావడంతో అప్పట్లో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. చదవండి: ఐటీకి తెలంగాణ బంగారు గని

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌