amp pages | Sakshi

ఈఆర్సీ కోసం నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్

Published on Thu, 12/09/2021 - 01:33

సాక్షి, హైదరాబాద్‌: దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు నెట్‌ జీరో ఎనర్జీ భవనాలు దోహదపడతాయని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. లక్డీకాపూల్‌లో తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) కొత్త భవన నిర్మాణానికి బుధవారం ఆమె శంకుస్థాపన చేశారు. నెట్‌ జీరో ఎనర్జీ/ వాటర్‌/ కార్బన్‌ భవనంగా దీనిని నిర్మిస్తుండడం అభినందనీయమన్నారు. పర్యావరణ మార్పుల నుంచి భూగోళాన్ని రక్షించుకునేందుకు, మానవాళి మనుగడను కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలు అత్యవసరమని పేర్కొన్నారు.

శాస్త్రపరిజ్ఞానంలో వస్తున్న ఇలాంటి అధునాతన మార్పులను వినియోగించుకుని ముందుకు పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. సోలార్‌ ప్యానెళ్లు, ఇంధన పొదుపు డిజైన్, వెంటిలేషన్, ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టం, స్మార్ట్‌ గ్రిడ్‌ మీటర్, ఇంధన పొదుపు లైటింగ్‌ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ భవనంలో ఉండనున్నాయని గవర్నర్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈఆర్సీ చైర్మన్‌ టి.శ్రీరంగరావు, సభ్యులు మనోహర్‌రాజు, బి.కృష్ణయ్య, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ షర్మన్‌ తదితరులు పాల్గొన్నారు. 

నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్‌ అంటే..  
ఏడాదికి అవసరమయ్యే విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకుని వినియోగించుకునే భవనాలను నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్స్‌ అంటారు. సౌర విద్యుత్‌ను అక్కడికక్కడే ఉత్పత్తి చేసి నిల్వ చేసుకునే సదుపాయాన్ని ఈ భవనాలు కలిగి ఉంటాయి. అంతేకాకుండా భవనంపై కురిసే వర్షపు నీరు, పరిసరాల్లోని మురుగు నీటిని ప్రత్యేక ట్యాంకుల్లో నిల్వ చేస్తారు.

ఈ నీళ్లను శుద్ధి చేసి వాడుకుంటారు. ఇలాంటి భవనాలను నెట్‌ జీరో వాటర్‌ అంటారు. అంటే ఈ భవనాలకు బయట నుంచి విద్యుత్, తాగునీటి సరఫరా అవసరం ఉండదన్న మాట.     

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)