amp pages | Sakshi

వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం

Published on Wed, 01/12/2022 - 08:20

సాక్షి, వరంగల్‌: వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దంచికొట్టిన వానతో జనజీవనం స్తంభించి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్‌లో కుండపోతగా రాళ్లవాన కురిసింది. ఇటుకాలపల్లి, అకులతండ, ఇప్పల్ తండ, నల్లబెల్లి, దుగ్గొండి ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన రాళ్లవానతో అపార నష్టం సంభవించింది. గాలివాన వడగళ్లతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సప్లై నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.

గాలివానతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఐస్ గడ్డలు పడ్డట్లు రాళ్లవాన కురిసింది. మిర్చి పత్తితోపాటు పండ్లతోటలకు అపార నష్టం వాటిల్లింది.వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు.

సహాయక చర్యలకై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రజలను కోరారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది‌. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

వరంగల్‌ నగరంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చిన్నసైజులో వడగళ్లు కూడా పడ్డాయి. విద్యుత్‌సరఫరాలో అంతరాయమేర్పడింది. వరద నీటితో డ్రెయినేజీ వ్యవస్థ స్తంభించడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్‌ చౌరస్తా, బీటు బజారు, మేదరవాడ, అండర్‌ బ్రిడ్జి, తదితర రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది.

వరంగల్‌ స్టేషన్‌రోడ్డు, జేపీఎన్‌ రోడ్డు, పోచమ్మమైదాన్‌ నుంచి ములుగు రోడ్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షం నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులకు ఎటూ వెళ్లే మార్గం లేకుండా పోయింది. ప్రధాన జంక్షన్లు, రహదారుల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.     

Videos

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)