amp pages | Sakshi

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క క్లిక్‌తో మీ సొంతం 

Published on Thu, 07/01/2021 - 08:00

సాక్షి, హైదరాబాద్‌: కాలేజీ విద్యార్థుల సరదాలు తీర్చేందుకు స్వల్పకాలిక ఈజీ లోన్స్‌(తేలికగా రుణం) ఇచ్చేందుకు కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు ముందుకొచ్చాయి. విద్యార్థులు ల్యాప్‌టాప్, పర్సనల్‌ కంప్యూటర్, బైక్, స్మార్ట్‌ఫోన్‌ తదితర వస్తువుల కొనుగోలుకు రూ.3 వేల నుంచి 80 వేల వరకు రుణం మంజూరు చేసే సంస్థలను ఆశ్రయిస్తున్న గ్రేటర్‌ విద్యార్థుల సంఖ్య సిటీలో వేలల్లోకి చేరుకుంది. ఇదే అదనుగా నకిలీ ఐడెంటిటీ కార్డులతో రుణం పొంది ఎగవేస్తున్న విద్యార్థులు సైతం ఉండడంతో ఆయా సంస్థలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ పరిణామం శ్రుతి మించితే రుణ చెల్లింపుల విషయంలో తల్లిదండ్రులకు తలనొప్పులు తప్పవంటున్నారు విద్యావేత్తలు. 

ఈజీ లోన్స్‌ ఇలా.. 
► ప్రతి అంశాన్నీ ఒక్క క్లిక్‌తో తెలుసుకునే గ్రేటర్‌ స్టూడెంట్స్‌ తాజాగా స్వల్పకాలిక తేలికపాటి రుణాలు పొందేందుకు పలు ఆన్‌లైన్‌ క్రెడిట్‌ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.  
►మహానగరం పరిధిలో సుమారు 300 ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వీటిని ఆశ్రయిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  
► ప్రధానంగా క్రెడిట్‌ 24, క్వికర్‌లోన్, ఎం పాకెట్‌ తదితర సంస్థలు ఈ విషయంలో ముందున్నాయి.  
► ఇక ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థినీ విద్యార్థుల వద్దకే ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు తరలివస్తున్నారు. తొలుత ర.3 వేల నుంచి ర.5 వేల వరకు స్వల్పకాలిక సూక్ష్మ రుణాలు అందజేస్తున్నారు.  
►  ఈ చిన్నపాటి రుణాలను సకాలంలో తీర్చినవారికి గరిష్టంగా రూ.80 వేల వరకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణగ్రహీత సౌలభ్యాన్ని బట్టి  నెలవారీగా కొంత మొత్తాన్ని వాయిదాగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి.  
► ఇక రుణం జారీ చేయాలంటే విద్యార్థుల కళాశాల ఐడెంటిటీ కార్డు, ఇంటి చిరునామ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ ప్రతులను పూచీకత్తుగా స్వీకరిస్తున్నాయి.
► ముందుజాగ్రత్తగా వారి నుంచి రుణం జారీ షరతులకు సంబంధించి రెండు పేజీల నిబంధనల పత్రాలపై సంతకాలు తీసుకుంటుండడం గమనార్హం.  

ఎగవేతదారులూ షరామామూలే..
విద్యార్థులు చిన్నపాటి అవసరాలు, సరదాలను తీర్చేందుకు ఈజీ లోన్స్‌ బాగానే ఉన్నా..ఇదే అదనుగా తమ మిత్రులు, తెలిసినవారి కళాశాలల ఐడెంటిటీ కార్డులు, జిరాక్స్‌ ప్రతులను సేకరిం ఆన్‌లైన్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న అక్రమార్కులూ ఉన్నట్లు ఆయా రుణజారీ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. తీరా రుణం మంజూరు చేశాక ఆరా తీస్తే సదరు విద్యార్థి ఆ కళాశాలలో చదవడం లేదన్న నిజాలు వెలుగుచూస్తుండడంతో ఆయా సంస్థలకు ముచ్చెమటలు పట్టిస్తుండడం గమనార్హం. ఇక కొన్ని రుణజారీ సంస్థలు రుణ వాయిదాల వసూళ్ల కోసం తల్లిదండ్రులకు నేరుగా ఫోన్లు చేస్తుండడం, వారి ఇళ్లకు వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 

జాగ్రత్తలూ అవసరమే.. 
► విద్యార్థుల అవసరాలకు ఈజీలోన్స్‌ ఒక పరిమితికి మించి అవసరమే కానీ..శృతి మించితే అనర్థాలు తప్పవని విద్యావేత్తలు, కళాశాలల Ķæజవన్యాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థుల జీవనశైలిలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని సచిస్తున్నారు. అప్పులు చేసి గొప్పలకు పోతే విద్యార్థుల జీవితాలు ప్రవదంలో పడినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఇక రుణం తీసుకునే సమయంలో గుడ్డిగా సంతకాలు చేయకుండా జాగ్రత్తగా షరతులతో కూడిన నిబంధనలను అమూలాగ్రం చదివి సంతకం చేయాలని సచిస్తున్నారు. పరీక్ష, ట్యూషన్, కోచింగ్‌లు, పుస్తకాల కొనుగోలు, నూతన కోర్సులు నేర్చుకునేందుకు రుణం పొందితే ఫర్వా లేదని.. విలాసవంతమైన జీవనశైలి గడిపేందుకు రుణం తీసుకుంటే చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)