amp pages | Sakshi

మధుమేహ భారతం! 73 శాతం మందికి షుగర్‌ వచ్చే ఛాన్స్‌!

Published on Mon, 02/13/2023 - 01:09

సమాజాన్ని దీర్ఘకాలిక వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. దేశంలో జరుగుతున్న మరణాల్లో 65 శాతం దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని... అధిక బరువు, ఊబకాయం వల్ల షుగర్‌ వచ్చే ప్రమాదం ప్రజల్లో 73 శాతం ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) తేల్చిచెప్పింది.

ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధులపై ఐసీఎంఆర్, ఎన్‌ఐఎన్‌ సహా 21 సంస్థలు సర్వే చేశాయి. దేశవ్యాప్తంగా 600 ప్రాంతాల నుంచి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న 10,659 మందిని (18–69 ఏళ్ల వయసు వారు) సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించాయి. తెలంగాణలో జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) సర్వే చేసింది. సర్వే నివేదికపై పార్లమెంటు ఇటీవల చర్చించింది. దేశంలో దీర్ఘకాలిక వ్యాధులపై జరిగిన మొట్టమొదటి సర్వే ఇదేనని కేంద్రం తెలిపింది. 
– సాక్షి, హైదరాబాద్‌

సర్వేలో వెల్లడైన అంశాలు... 
►2019లో దేశంలో దీర్ఘకాలిక జబ్బులతో 61 లక్షల మంది చనిపోయారు. అందులో షుగర్‌తో 1.70 లక్షల మంది మరణించారు. 1990తో పోలిస్తే దీర్ఘకాలిక వ్యాదులతో మరణించే వారి సంఖ్య రెట్టింపు అయింది. 
►ధూమపానం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 15.5 శాతం ఎక్కువ. అధికంగా పొగతాగడం వల్ల కేన్సర్‌ ముప్పు సైతం 39 శాతం పెరుగుతుందని సర్వే తేల్చింది. 

ఉప్పుతో పెరుగుతున్న ముప్పు... 
►సర్వేలో పాల్గొన్న వారిలో సగటు ఉప్పు విని­యోగం 8 గ్రాములుగా వెల్లడైంది. అందులో పు­రుషుల్లో ఉప్పు సగటు వినియోగం 8.9 గ్రాములుకాగా, మహిళలు 7.1 గ్రాము­లు వా­డుతున్నారు. పట్టణాల్లో 8.3 గ్రాము­లు, పల్లె­ల్లో 8 గ్రాముల మేర వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినదానికంటే దేశం­లో రెట్టింపు ఉప్పు వినియోగం జరుగుతోంది. 

‘పొగ’బారిన 33% మంది 
సర్వే ప్రకారం దేశంలో 32.8 శాతం మంది పొగతాగుతున్నారు. అందులో పురుషులు 51.2 శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. పట్టణాల్లో 25 శాతం, పల్లెల్లో 36.8 శాతం పొగ తాగుతున్నారు.  

►15.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. అందులో పురుషులు 28.3 శాతం, మహిళలు 2.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 14.2 శాతం, పల్లెల్లో 16.7 శాతం ఉన్నారు. అందులో అధిక మద్యం సేవించేవారు 5.9 శాతం మంది ఉన్నారు. అధిక మద్యం సేవించేవారిలో పురుషులు 10.9 శాతం, 0.5 శాతం మహిళలున్నారు. పట్టణాల్లో 10.7 శాతం, పల్లెల్లో 6.1 శాతం అధిక మద్యం సేవిస్తున్నారు. దేశంలో మద్యం వినియోగించే వారిలో 20–35 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నారు. 

వేధిస్తున్న ఊబకాయం... 
►సర్వేలో పాల్గొన్న వారిలో 41.3 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో పురుషులు 30.9 శాతం మంది, మహిళలు 52.4 శాతం ఉన్నారు. పట్టణాల్లో 51.7 శాతం, గ్రామాల్లో 36.1 శాతం మంది చేయడంలేదు.  
►26.1 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అందులో పురుషులు 23.3 శాతం, మహిళలు 29.3 శాతం ఉన్నారు. పట్టణాల్లో 42.5 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు, గ్రామాల్లో ఇది 18 శాతంగా ఉంది. 

పెరుగుతున్న బీపీ, షుగర్‌...  
►28.5 శాతం మందిని బీపీ పట్టిపీడిస్తోంది. పురుషుల్లో 29.9 శాతం, మహిళల్లో 27 శాతం బీపీతో బాధపడుతున్నారు. ఇక పట్టణాల్లో 34 శాతం, గ్రామాల్లో 25.7 శాతం మంది బీపీతో ఉన్నారు.  
►9.3 శాతం మంది షుగర్‌తో బాధపడుతున్నారు. అందులో పురుషుల్లో 8.5 శాతం, మహిళల్లో 10.2 శాతం షుగర్‌ ఉంది. పట్టణాల్లో 14.4 శాతం, గ్రామాల్లో 6.9 శాతంగా ఉంది. 

2040 నాటికి ‘బరువు’మూడింతలు
►సర్వే అంచనాల ప్రకారం 2040 నాటికి అధిక బరువు బాధితుల సంఖ్య రెట్టింపు కానుంది. ఊబకాయం బాధితుల సంఖ్య మూడింతలు అవుతుంది. బీఎంఐ 25–30 మధ్య ఉంటే అధిక బరువు అంటారు. బీఎంఐ 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం అంటారు. నడుము చుట్టుకొలత పురుషుల్లో 90 సెంటీమీటర్లు, మహిళల్లో 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే అధిక పొట్ట ఉన్నట్లు లెక్క. 
►బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే అధికంగా ఉన్నట్లు. షుగర్‌ ఫాస్టింగ్‌ 126 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు లెక్క. 

వ్యాయామానికి విరామం... 
►ఈ సర్వే ప్రకారం దేశంలో 98.4 శాతం మంది నిర్ణీత పరిమాణంలో కూరగాయలు, పండ్లు తీసుకోవడంలేదు.  
►వారానికి కనీసం 150 నిమిషాలపాటు తేలికపాటి నుంచి మధ్యస్థ స్థాయి లేదా 75 నిమిషాలపాటు తీవ్రస్థాయిలో శారీరక శ్రమ చేయాలి. ఆ ప్రకారం శారీరక శ్రమ చేయనివారు 41.3 శాతం మంది ఉన్నారు. 

ప్రతి మూడు మరణాల్లో రెండు అవే...
గత 30 ఏళ్లలో జీవనశైలి జబ్బుల ప్రభావం భారతీయుల్లో రెట్టింపైంది. దేశంలో ప్రస్తుతం సంభవించే ప్రతి 3 మరణాలలో రెండు వీటికి చెందినవే. తగిన శారీరక శ్రమ, బరువును అదుపులో ఉంచుకోవడం, తాజా కూరగాయలు, పండ్లు రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా తీసుకోవడం ద్వారా ఈ జబ్బులను దూరం చేయవచ్చు. 
– డాక్టర్‌ హరిత, వైద్యురాలు, నిజామాబాద్‌  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)