amp pages | Sakshi

మహాలయ పిండ్‌దాన్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌

Published on Mon, 08/22/2022 - 02:51

సాక్షి, హైదరాబాద్‌: రానున్న మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకు పిండప్రదానాలు సమర్పించే వారి కోసం హైదరాబాద్‌ నుంచి ఉత్తరాదికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలును నడపనుంది. స్వదేశ్‌ దర్శన్‌ రెండో ప్యాకేజీలో భాగంగా సెప్టెంబర్‌ 15 నుంచి 20 వరకు (ఐదు రాత్రులు, 6 పగళ్లు) మహాలయ పిండ్‌ దాన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడపనున్నట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ కిశోర్‌ తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి విజయవాడ, విశాఖ, భువనేశ్వర్‌ మీదుగా గయ, వారణాసి, ప్రయాగ సంగమం వరకు వెళ్లి తిరిగి సికింద్రాబాద్‌ చేరుకోనుంది. రైలు చార్జీలతోపాటు రోడ్డు రవాణా, వసతి, భోజనం తదితర సదుపాయాలతో స్లీపర్‌ క్లాస్‌లో ఒక్కొక్కరికీ రూ. 14,485 చొప్పున, థర్డ్‌ ఏసీ రూ. 18,785 చొప్పున ఉంటుంది. ఈ పర్యటనలో ఇద్దరు లేదా ముగ్గురికి కలిపి నాన్‌ ఏసీ హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు.

నేచర్‌ టూర్స్‌
కశ్మీర్, కేరళ, కన్యాకుమారి, రామేశ్వరం, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో నేచర్‌ టూర్‌లను ఆస్వాదించే మరో సదుపాయాన్ని కూడా ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 25, సెప్టెంబర్‌ 8, 23 తేదీల్లో హైదరాబాద్‌ నుంచి లేహ్, లద్దాక్‌లకు విమాన టూర్‌లను ప్రవేశపెట్టింది. ఈ పర్యటనలో లేహ్, శ్యామ్‌ వ్యాలీ, నుబ్రా, తుర్టక్, తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌ చార్జీ ఒక్కొక్కరికి రూ. 38,470 చొప్పున ఉంటుంది.

సెప్టెంబర్‌ 13 నుంచి రాయల్‌ రాజస్తాన్‌ పర్యటన మొదలవుతుంది. ఈ పర్యటనలో జైపూర్, జోధ్‌పూర్, పుష్కర్, ఉదయ్‌పూర్‌ తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. ఫ్లైట్‌ చార్జీలతోపాటు అన్ని వసతులకు ఒక్కొక్కరికీ రూ. 29,400 చొప్పున చార్జీ ఉంటుంది.

కేరళ డిలైట్స్‌ పేరుతో ఐఆర్‌సీటీసీ మరో టూర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్‌ 7న ఈ టూర్‌ మొదలవుతుంది. అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. రూ. 35,500 చొప్పున చార్జీ ఉంటుంది.

సౌత్‌ ఇండియా టెంపుల్‌ రన్‌ టూర్‌లో భాగంగా కన్యాకుమారి, మదురై, రామేశ్వరం, తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాలను సందర్శించవచ్చు. నవంబర్‌ 1 నుంచి 6 రాత్రులు, 7 పగళ్లు ఈ పర్యటన కొనసాగుతుంది. ఒక్కొక్కరికీ రూ. 30,200 చొప్పున చార్జీ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ ఫోన్‌ నంబర్ల 040–27702407/9701360701 ను సంప్రదించవచ్చు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)