amp pages | Sakshi

కుర్ర‘కారు’ రివ్యూ

Published on Mon, 12/21/2020 - 11:18

‘చిన్నప్పటి నుంచీ కార్లపై ఆసక్తి. అవి ఎక్కి తిరగడం కన్నా వాటి గురించి విశేషాలు చెవికెక్కించడం అంటే మరింత ఇష్టం’ అని చెప్పాడు ఆల్వాల్‌లో నివసించే కబీర్‌ శర్మ.. ఆ ఇష్టాన్నే దినదినాభివృద్ధి చేసుకుని ప్రస్తుతం సిటీలోనే టాప్‌ క్లాస్‌ కార్ల రివ్యూయర్‌గా రాణిస్తున్నాడు. టిక్‌టాక్‌లు, డబ్‌స్మాష్‌లు, పబ్‌జీగేమ్స్‌ అంటూ టీనేజర్లు ఊగిపోతున్న పరిస్థితుల్లో వైవిధ్యభరిత అభిరుచితో ఆకట్టుకుంటున్న ఈ 12వ తరగతి విద్యార్థి ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే.. 

సాక్షి, హైదరాబాద్‌: సిటీలో కార్లు వినియోగించే వారు లక్షల్లో ఉండొచ్చు. కానీ కార్ల గురించి సమగ్రమైన అవగాహన మాత్రం వందల మందికైనా ఉంటుందా అనేది సందేహమే. అలాంటిది కార్‌ డ్రైవింగ్‌కు సరిపడా వయసు కూడా లేని సిటీ టీనేజర్‌.. రయ్యిమంటూ దూసుకుపోతున్నాడు కారులో కాదు కార్ల రివ్యూస్‌లో.. ఖరీదైన కొన్ని కార్లను రివ్యూ చేసేందుకు అనుమతి పొందిన దేశంలోనే ఇద్దరు ముగ్గురు రివ్యూయర్స్‌లో దక్షిణాది నుంచి పిన్న వయసు్కడైన ఈ సిటీ కుర్రాడూ ఉండటం విశేషం.

కాస్ట్‌లీ.. నాట్‌ ఈజీ
హైపర్‌ సిరీస్, సూపర్‌ కార్స్‌కు కూడా షోరూమ్‌లోనే సంప్రదిస్తా. అయితే దీనికి సంబంధించిన నిపుణులు ముందుగా నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. రివ్యూ స్కిల్స్‌ ఉన్నాయా లేదా? అని పరిశీలిస్తారు. అంతకుముందు నేను చేసిన రివ్యూలకు సంబంధించి నా ప్రతి వీడియో చెక్‌ చేస్తారు.  

  • కనీసం 3 రోజుల నుంచి వారం రోజుల తర్వా త అప్రూవల్‌ వస్తుంది. సిటీలోని సీఎల్‌ ఫైవ్‌ షో రూమ్‌లో అలా రివ్యూ చేసిన కార్లలో.. తొ లి సారి రూ.3 కోట్ల ఖరీదైన ల్యాంబొర్గని హ్యురకేన్‌ స్పైడర్‌ కార్‌కు అనుమతి సాధించా.  
  • సూపర్‌ కార్‌ సిరీస్‌లో రెండవదిగా ఓపెన్‌ టాప్‌ ఫెరారి కాలిఫోర్నియా టి కన్వర్టబుల్‌ వర్షన్‌ చేశాను. మూడవది ఆడి ఆర్‌ 8 ఎల్‌ఎమ్‌ఎక్స్‌ ఎడిషన్‌ నాకు చాలా స్పెషల్‌ అని చెప్పాలి. ఎందుకంటే మన దేశంలో నాతో సహా కేవలం ఇద్దరు మాత్రమే దాన్ని ఇప్పటిదాకా రివ్యూ చేశారు. ప్రపంచంలో అవి కేవలం 99. దేశంలో కేవలం 3 వాహనాలు మాత్రమే ఉన్నాయి.  
  • అలాగే బెంట్లీ ఫ్లయింగ్‌ స్పర్‌ కూడా రివ్యూ చేశాను. దీన్ని కూడా ఇప్పటిదాకా నలుగురు మాత్రమే రివ్యూ చేశారు. ఇక ఐదోది మెర్సిడెస్‌ ఏఎమ్‌జీ జీటీఎస్‌ దీన్ని కూడా చాలా తక్కువ మంది రివ్యూ చేశారు. ఆరోది జాగ్వార్‌ ఎక్స్‌జెఎల్‌. ఇప్పటి దాకా ఓ డజను మంది చేసి ఉంటారేమో..  
  • తాజాగా ఎంజీ ఇండియా మోటార్స్‌ సంస్థ అక్టోబరు 7న కొత్త కారు లాంచింగ్‌ సందర్భంగా నాకు ప్రత్యేక ఆహ్వానం పంపింది. రెండేళ్లుగా కబీర్‌ స్కోప్‌ పేరుతో యూ ట్యూబ్‌లో రివ్యూ వీడియోస్‌ అప్‌లోడ్‌ చేస్తూ వచ్చాను. నా రివ్యూలు హిందీ, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో ఉంటాయి.  

ప్యాషన్‌ ఉంటే చాలదు పర్మిషన్‌ కావాలి
మనకు కార్ల రివ్యూ అనే టాపిక్‌ మీద ఇష్టం ఉంటే చాలదు. రూ.లక్షలు, కోట్లు ఖరీదు చేసే కార్లను రివ్యూ చేయాలంటే సదరు కంపెనీల అనుమతి తప్పనిసరి. బడ్జెట్‌ సెగ్మెంట్‌ కార్స్‌ను ఫోన్‌ లేదా ఈ మెయిల్, ద్వారా సంప్రదిస్తాను. మొదట్లో కొన్ని నమూనా రివ్యూల ద్వారా ఆయా బ్రాండెడ్‌ కార్ల షోరూమ్స్‌ నిర్వాహకులను ఒప్పించగలిగాను. అనుమతి ఇచ్చిన తర్వాత ఆయా డీలర్‌ షిప్‌ ఆవరణలోనే రివ్యూ చేస్తున్నాను. ఇప్పటి దాకా 25కిపైగా బడ్జెట్‌ కార్స్‌ రివ్యూస్‌ చేశాను.  

రిలేషన్స్‌ నుంచి రివ్యూస్‌ దాకా.. 
నా చిన్ననాటి కార్‌ లవ్‌ ఫొటోలు కలెక్ట్‌ చేసి బుక్స్‌లో దాచుకోవడం దగ్గర ఆగిపోలేదు. ప్రీమియం బ్రాండ్స్‌ డైకాస్ట్‌(కార్ల తయారీ కంపెనీలు ముందస్తుగా విడుదల చేసే బుల్లి నమూనా వాహనాలు) మోడల్స్‌ కలెక్ట్‌ చేశా.  ప్రపంచం మొత్తంలో 2వేల పీస్‌లు మాత్రమే ఉండే రోల్స్‌ రాయిస్‌ మోడల్‌ కూడా అందులో ఉంది. అలా పుట్టిన అభిరుచి కార్ల మంచి చెడుల గురించి స్టడీ చేసేదాకా ఎదిగింది. ఆ అవగాహనతోనే 12, 13ఏళ్ల వయసులోనే తెలిసిన ఫ్రెండ్స్, బంధువులకు కార్లుకొనే సమయంలో సలహాలు చెప్పేవాడ్ని. మొదట్లో చిన్న వాడిని అనుకున్నా, తర్వాత నా అనాలసిస్‌ సరైందే అని తెలిసి.. నన్ను సలహాలు అడుగుతుండేవారు. అప్పుడే కార్ల రివ్యూస్‌ ఆలోచన వచ్చింది.  

ప్రతి కామెంట్‌కి సమాధానం 
కార్లు చాలా మందికి ఇష్టం. అయితే ఎలాంటి కారు కొనాలి? అనేది సరిగా తెలియదు. వారికి ఉపయోగపడటమే నా ఆలోచన. అలాగే చాలామంది రివ్యూయర్స్‌ కామెంట్స్‌కి పెద్దగా స్పందించరు. అయితే నేను ప్రతి కామెంట్‌కి, ప్రశ్నకి సమాధానం ఇస్తాను. ఎప్పుడైనా సరే కార్‌ వినియోగదారుల సందేహాలకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటా. బెస్ట్‌ కార్‌ సజెస్ట్‌ చేస్తా. దేశంలోనే బెస్ట్‌ రివ్యూయర్‌ రాజస్థాన్‌కు చెందిన  గగన్‌ చౌదరి, ముంబైకి చెందిన ఫైజల్‌ ఖాన్‌ వంటి వారి కోవలో దక్షిణాది నుంచి పాపులర్‌ కావాలనేది ఆలోచన.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌