amp pages | Sakshi

‘నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్‌ తిలోదకాలు’ 

Published on Wed, 08/18/2021 - 09:01

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతకు మూలమైన నీళ్లు–నిధులు–నియామకాల విషయంలో తీవ్ర అన్యా యం జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకో వడం లేదని శాసనమండలి మాజీ చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌ ధ్వజమెత్తారు. కమీషన్ల పేరుతో ప్రభుత్వం దోచుకుంటోందని, గడీల పాలన తో కుటుంబపాలనకే పరిమితమైందని మండిపడ్డారు. ఈ అంశాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకే ఈ నెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్నారని వివరించారు.

మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్‌ డా.జి.మనోహర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పాదయాత్ర సహ ప్రముఖ్‌ తూళ్ల వీరేందర్‌ గౌడ్‌తో కలిసి స్వామిగౌడ్‌ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్య వైఖరితో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు నెలకొన్నాయని డీకే అరుణ విమర్శించారు. కృష్ణా పరీవాహక ప్రాంతం 68 శాతం తెలంగాణలో ఉండగా, తక్కువ నీటి వాటాకు కేసీఆర్‌ ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు.  

‘ఉద్యమ నిర్మాణాల్లో కీలకభూమిక పోషించాలి’ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రజాఉద్యమాల నిర్మాణం, సమస్యల పరిష్కారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కీలక భూమిక పోషించాలని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. సామాన్యులు, కష్టజీవులకు అండగా నిలుస్తూ సమస్యలపై తీవ్రస్థాయి ఉద్యమాలు చేపట్టి పార్టీపట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెంచాలని సూచించారు. మంగళవారం ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డిలతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉద్యమకార్యాచరణ, విస్తరణపై చర్చించారు. ప్రధాని మోదీ రైతు, కారి్మక, ఉద్యోగ, ప్రజావ్యతిరేక నల్లచట్టాలను తీసుకొచ్చారని రాజా ధ్వజమెత్తారు.   

ఉద్యమాల ఆవశ్యకత పెరిగింది: చాడ 
తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ ఉద్యమాల ఆవశ్యకత మరింత పెరిగిందని చాడ వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదని, పెండింగ్‌ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడంలేదని అన్నారు. నగరంలోని సీఆర్‌ ఫౌండేషన్‌ను డి.రాజా, ఆయన సతీమణి ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అనీరాజా సందర్శించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)