amp pages | Sakshi

ఆదాయ పన్ను పరిమితిని  రూ. 10 లక్షలకు పెంచాలి 

Published on Sun, 11/14/2021 - 03:18

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్‌జీఈఎఫ్‌) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా ప్రాంగణంలో శనివారం ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఆదాయపన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని కోరారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో 30% ఫిట్‌మెంట్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ఇచ్చా రని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా స్పందించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరితే, దాన్ని రాష్ట్రాలపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. ఏఐఎస్‌జీఈఎఫ్‌ జాతీయ చైర్మన్‌ కామ్రేడ్‌ సుభాష్‌ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ శ్రీకుమార్‌ల అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఈ సమావేశాలలో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. అలాగే కోవిడ్‌తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా మంజూరు లాంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌