amp pages | Sakshi

ఏటేటా.. ఉద్యోగులకు టాటా! 

Published on Fri, 09/29/2023 - 02:29

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మిక, ఉద్యోగ భాగస్వామ్యం ఏటేటా భారీగా తగ్గుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా కొత్తగా గనులు ఏర్పడక క్రమేపి ప్రైవేటీకరణ పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికులసంఖ్య 39 వేలకు చేరింది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. 

గత రెండు దశాబ్దాలుగా సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో కాంట్రాక్టు వ్యవస్థ పెరిగిపోయింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ పథకం కింద, విధుల్లో నిర్లక్ష్యం పేరిట 1997 నుంచి 2014 వరకు వందలాది కార్మికులను తొలగించారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతమంది కార్మికులు ఉంటారనే చర్చ మొదలైంది.

కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ప్రక్రియ మొదలై వచ్చే నెల 5న ఓటర్ల జాబితా వెలువడితే పూర్తిస్థాయిలో సంఖ్య తేలనుంది. కార్మిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే 1998లో 1,08,212 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 39 వేలకు చేరింది. వీటితోపాటు రెండు వేల వరకు ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ ఉద్యోగులు ఉంటారు. గత 25 ఏళ్లలో 68 వేల మంది కార్మికులు తగ్గారు. కంపెనీలో ఇప్పటివరకు ఆరుసార్లు కార్మిక ఎన్నికలు జరిగాయి. నాటికీ, నేటికీ ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. గత ఆరేళ్లలోనే 13 వేలకుపైగా కార్మికులు తగ్గారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)