amp pages | Sakshi

ఎక్కడంటే అక్కడ ఆపాలంటూ!

Published on Sun, 12/24/2023 - 05:34

రాయచూర్‌ వెళ్లే నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్‌ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి  ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది.

సాక్షి, హైదరాబాద్‌: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబా­టు­లోకి వచ్చా­క, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచి­తంగా ప్రయాణించే వె­సు­లుబాటును కొందరు మహిళలు దుర్వి­నియోగం చేస్తున్నారన్న వాదన­లు వెల్లువె­త్తు­తున్నాయి.

తాము ఎక్కడ ఆప­మంటే బ­స్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు­్తన్నా­రు. ఆ బస్సులకు స్టాప్‌ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతు­న్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్‌ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్‌ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్‌ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్‌ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధి­కారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు.

మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం
ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్‌ స్పందించారు.

ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్‌
ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్‌ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు.

Videos

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)