amp pages | Sakshi

కరోనాపై ప్రైవేటు ఆస్పత్రుల తర్జనభర్జన

Published on Sat, 04/24/2021 - 03:57

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే కరోనా చికిత్సలతో నిండిపోయిన ఆస్పత్రులను ఇక ముందు పెరగనున్న వ్యాక్సినేషన్‌ ఉక్కిరిబిక్కిరి చేయనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 18-44 ఏళ్ల మధ్య వారికి కూడా కరోనా టీకాలు వేయనుండటంతో ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రద్దీ మరింత పెరగనుంది. అసలే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత మొదలైన ప్రస్తుత సమయంలో.. అటు కరోనా చికిత్సలు, ఇటు వ్యాక్సినేషన్‌ను ఎలా నిర్వహించాలన్న తర్జనభర్జన కనిపిస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లుపైబడిన వారికే టీకాలు వేస్తున్నారు. అందులో కొందరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, మరికొందరు ప్రైవేట్‌లో తీసుకుంటున్నారు. అయితే వచ్చే ఒకటో తేదీ నుంచి బహిరంగ మార్కెట్లోకి వ్యాక్సిన్‌ వస్తుండటంతో.. ప్రైవేట్‌ ఆస్పత్రులే టీకా బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే చికిత్సలు, వ్యాక్సినేషన్‌ను సమన్వయం చేసుకోవడంపై ఆస్పత్రులు దృష్టిపెట్టాయి.

భారీగా వ్యాక్సిన్లకు ఆర్డర్లు 
18-44 ఏళ్ల మధ్య వారికి కేంద్రం ఉచితంగా టీకా వేయబోవడంలేదు. 45 ఏళ్లు పైబడినవారికే ఉచితంగా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనే భారీగా వ్యాక్సినేషన్‌ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారు 1.82 కోట్ల మంది ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేసింది. ఇందులో చాలా వరకు ప్రైవే ట్‌లోనే టీకా పొందాల్సి ఉండనుంది. ఇంత భారీ సంఖ్యలో వ్యాక్సిన్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలను సిద్ధం చేయాల్సి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 3 వేల ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో టీకాలు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడి కల్‌ షాపుల్లో టీకాలు అందుబాటులో ఉంచుతారని.. వాటిలో కొనుగోలు చేసి, ఆస్పత్రిలో వేయించుకోవచ్చని అంటున్నారు. లేదా ఆస్పత్రులే ప్రత్యేకం గా ఏర్పాట్లు చేసి.. వ్యాక్సిన్‌ వేసే అవకాశాలున్నా యి. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు టీకాలకు ఆర్డర్లు పెట్టినట్లు సమాచారం.

ఇష్టమున్న వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు 
లబ్ధిదారులు తమకు ఇష్టమైన వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వీలు కల్పిస్తామని ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు అనుమతి ఉంది. తాజాగా అనుమతి పొందిన స్పుత్నిక్‌ టీకాతోపాటు త్వరలో ఫైజర్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, మోడెర్నా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తాయని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఫైజర్‌ టీకాను మైనస్‌ 70 నుంచి మైనస్‌ 80 డిగ్రీల మధ్య నిల్వ చేయాలి. ఆ మేరకు అటు కంపెనీ, ఇటు ప్రైవేట్‌ ఆస్పత్రులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టీకా అందుబాటులోకి వచ్చినా దాని ఖరీదు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

28 నుంచి టీకాలకు రిజిస్ట్రేషన్లు
18-44 ఏళ్ల మధ్య వయసు వారికి వచ్చే ఒక టో తేదీ నుంచి మొదలయ్యే వ్యాక్సినేషన్‌కు సం బంధించి.. ఈ నెల 28వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం 28వ తేదీలోగానే వ్యాక్సినేషన్‌ కేం ద్రాల వివరాలను వైద్యారోగ్యశాఖ కోవిన్‌ పోర్టల్‌ లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉండనుంది. ఈ ప్రక్రియ మొదలు కాలేదని అధికారులు తెలిపారు. 

చదవండి: వినూత్నం.. ఎంపీ, ఎమ్మెల్సీ గుర్రమెక్కి మరీ..

చదవండి: తెలంగాణ ఆదర్శం.. వాయువేగాన ఆక్సిజన్‌

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌