amp pages | Sakshi

రాజాసింగ్‌ రిమాండ్‌ పిటిషన్‌ విచారణ వాయిదా 

Published on Sat, 11/12/2022 - 02:59

సాక్షి, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రిమాండ్‌ పిటిషన్‌ను లోయర్‌కోర్టు తిరస్కరించడం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన కేసులో విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) బీఎస్‌ ప్రసాద్, రాజాసింగ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

లోయర్‌కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిన మరుసటిరోజే... రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ మోపి జైలుకు పంపారని, 77 రోజులు కారాగారంలో ఉంచారని దామోదర్‌రెడ్డి తెలిపారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తిని అక్రమంగా అరెస్టు చేయడం ఆక్షేపణీయమన్నారు. 41ఏ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని లోయర్‌ కోర్టు తప్పుబట్టిందని వివరించారు.

పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు కూడా ఇది విరుద్ధమని నివేదించారు. అనంతరం ఏజీ వాదనలు వినిపిస్తూ.. ప్రతీ కేసులో 41ఏ కింద నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇదే తరహాలో ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోందని, ఆ కేసులో 41ఏ నోటీసులకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఉత్తర్వుల మేరకు ఈ కేసులోనూ ముందుకు పోవచ్చని చెప్పారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు విచారణ సుప్రీంకోర్టులో సోమవారం ఉన్నందున.. రాజాసింగ్‌ రిమాండ్‌ కేసును వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.   

Videos

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)