amp pages | Sakshi

ప్రభుత్వ సలహాదారుగా శోభ

Published on Tue, 03/01/2022 - 02:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు.

అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్‌ఎం డోబ్రియల్‌ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.

అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. 

Videos

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)