amp pages | Sakshi

రూ.2 వేల కోట్లతో గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లు 

Published on Sun, 04/02/2023 - 10:18

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మంజూరు చేసిందని, ఈ పనులకు సంబంధించిన అనుమతులు తాజాగా జారీ అయ్యాయని గిరిజన, మహిళాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వెల్లడించారు. ఈ రోడ్లతో గిరిజన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 1,179 రోడ్ల నిర్మాణ పనులను ఈ నిధులతో చేపడతామన్నారు. మొత్తం 3,152.41 కిలోమీటర్ల మేర పనులకు త్వరలో టెండర్లు పూర్తి చేస్తామని, వెనువెంటనే పనులు ప్రారంభించి ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తలపెట్టిన కార్యక్రమాలను శనివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీ క్యాంపస్‌లో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేకంగా గిరిజన బాలబాలికల వసతి గృహాలను నిర్మించనుందని తెలిపారు. ఇప్పటికే వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో 500 మంది విద్యార్థులకు సరిపడేలా హాస్టళ్లను నిర్మిస్తున్నామన్నారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.324 కోట్లు ఖర్చు చేసి త్రీఫేజ్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పించడంతో దాదాపు 2.4 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 4 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరిందని వెల్లడించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో పోడు భూముల పట్టాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాయని, ఆ తర్వాత వెంటనే పట్టాలు పంపిణీ చేసేందుకు గిరిజన సంక్షేమ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటు చట్టం చేసినప్పటికీ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం బాధాకర మన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 వందల ఎకరాల భూమి అప్పగించిందని, దీనితో పాటు భవనాలు, ఇతర వసతులను కూడా కల్పించి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి బాధ్యతలు అప్పగించిందన్నారు.

ఇదంతా పూర్తయి దాదాపు మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాకపోవడంతో గిరిజన బిడ్డలు ఉన్నత చదువులకు నోచుకోలేకపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తు, ట్రైకార్‌ చైర్మన్‌ రామచంద్రనాయక్, జీసీసీ చైర్మన్‌ రమావత్‌ వాల్యా నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ

చంద్రబాబు పై గాడిద సామెత

"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)