amp pages | Sakshi

నిత్యం పొడవాటి గడ్డంతోనే..! ఈ ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా?

Published on Fri, 11/11/2022 - 17:28

తెలంగాణకు చెందిన ఆ కాంగ్రెస్‌ నేత స్టైలే వేరు. రాజకీయాలపై మాట్లాడితే మాటల తూటాలే. చూడటానికి కూడా గంభీరంగా ఉంటారు. ఆయనకంటూ ప్రత్యేక హెయిర్‌ స్టైల్‌, గడ్డం, నడక తీరు ఉంటుంది. ఎప్పుడూ బారెడు గడ్డం, పొడవాటి మీసంతో జనాల్లో కనిపించే ఆ కాంగ్రెస్‌ నేత ఒక్కసారిగా మారిపోయారు. నిత్యం గడ్డం, మీసాలు పెంచుతూ ఉండే ఆయన ఉన్నట్టుండి క్లీన్‌షేవ్‌తో దర్శనమిచ్చారు .దీంతో ఆయనను గుర్తుపట్టడం కొందరికి కష్టమైపోయింది.

తిరుపతి వెంకన్న భక్తుడైన ఆ కాంగ్రెస్‌ నేత ఎవరో కాదు.. మన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి. ఆయన తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కుతీర్చుకున్నారు. దీంతో జగ్గారెడ్డిని గడ్డం మీసాలు లేకుండా గుర్తుపట్టలేకపోతున్నారు కొందరు. అసలు ఆయనేనా అని పరీక్షించి చూస్తున్నారు. ప్రస్తుతం జగ్గారెడ్డి కొత్త లుక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, జగ్గారెడ్డికి దైవ భక్తి ఎక్కువ. తరుచూ పూజల్లో పాల్గొంటారు. పండుగల సందర్భంగా చందాల కోసం వచ్చిన భక్తులకు తనకు తోచిన సాయాన్ని చేస్తూనే ఉంటారు.. ఇటీవల రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ఆయన నియోజకవర్గంలో (సంగారెడ్డి) ప్రవేశించిన సందర్భంగా జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకుంటూ పోతురాజులను అనుకరించిన విషయం తెలిసిందే.
చదవండి: ED Raids Telangana: గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)