amp pages | Sakshi

కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం

Published on Fri, 09/08/2023 - 14:58

సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు.

శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.  విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్‌రావు.

Videos

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

విజయవాడలో సాక్షి ప్రజా ప్రస్థానం

పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు

వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ

చంద్రబాబుని చీ కొడుతున్న ప్రజలు..రాచమల్లు స్ట్రాంగ్ కౌంటర్

ముమ్మరంగా ప్రచారం..జగన్ కోసం సిద్ధం..

ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?

చంద్రబాబు కుట్రలు...భగ్నం

చంద్రబాబు బాటలోనే రెండు కళ్ల సిద్ధాంతం అంది పుచ్చుకున్న బిజెపి

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)