amp pages | Sakshi

Telangana: నేడు పీఆర్సీ అమలు ప్రకటన!

Published on Tue, 06/08/2021 - 01:10

కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. పీఆర్సీ అమలు ద్వారా ప్రస్తుత జూన్‌ నెలకు సంబంధించి వచ్చే జూలైలో చెల్లించనున్న జీతాలను పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 
►పీఆర్సీ బకాయిల చెల్లింపులపైనా కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలుస్తోంది.
►లాక్‌డౌన్‌ ఎత్తివేయని పక్షంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపు సమయాన్ని పొడిగించే అవకాశం.
►మరికొన్ని రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగించాలనే యోచనలో ప్రభుత్వం.
►ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల రద్దు ద్వారా విద్యార్థులందరినీ పాస్‌ చేసే అవకాశం. 
►ఒకవేళ ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎవరైనా ఫెయిలై ఉంటే, ఫెయిలైన సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులను ప్రథమ, ద్వితీయ సంవత్సరం సబ్జెక్టుల్లో కలిపి పాస్‌ చేసే చాన్స్‌.

సాక్షి, హైదరాబాద్‌: నేడు జరగనున్న కేబినెట్‌ సమావేశంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, విద్యార్థులతోపాటు సాధారణ ప్రజానీకం సైతం ఇందులో తీసుకునే కీలక నిర్ణయాల కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్‌ శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు గత ఏప్రిల్‌ నుంచే ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వం వాయిదా వేయాల్సి వచ్చింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పడే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో పీఆర్సీపై సానుకూల ప్రకటన చేసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా పీఆర్సీ అమలు అంశంపై చర్చించి ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. పీఆర్సీ బకాయిల చెల్లింపులపై సైతం నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ అమలుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మంత్రిమండలికి నివేదించనున్నారు. ఆర్థిక పరిస్థితులపై సమీక్షించిన అనంతరం పీఆర్సీపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీపై మంగళవారంలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని, ఆ వెంటనే ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో సోమవారం తీవ్ర చర్చ జరిగింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం వారు మరోసారి కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 


లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా.. సడలింపు పొడిగిస్తారా?
కరోనా రెండో వేవ్‌ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో మినహాయింపు సమయాన్ని పొడిగించవచ్చని తెలుస్తోంది. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతు బంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.

ఇంటర్‌ పరీక్షల రద్దుపై.. 
కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రభుత్వానికి తాజాగా సిఫారసు చేసింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో సాధించిన మార్కులకు సమానంగా సెకండియర్‌లోని ఆయా సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్‌ చేయాలని ప్రతిపాదించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యి కేబినెట్‌ సమావేశం ముందుంచడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కేబినెట్‌ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకోగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం అదే ఆలోచనతో ఉంది. వేసవి సెలవులు ముగింపునకు రావడంతో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం తేదీలు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసుల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులు తదితర అంశాలపై సైతం మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)