amp pages | Sakshi

కేసీఆర్‌ తాతా! మా మొర వినండి.. ‘జడ వేసే టైమ్‌ లేక జుట్టు కట్‌ చేయించింది!’

Published on Mon, 06/06/2022 - 00:53

నా పేరు వి.శ్రీనిత. ఫోర్త్‌ క్లాస్‌ చదువుతున్నాను. మేము దుండిగల్‌లో ఉంటాం. మా మమ్మీ అర్చన దుండిగల్‌లోని ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌గా పనిచేసేది. మా డాడీ పేరు కేశవనారాయణ మేడ్చల్‌ జిల్లా మల్లంపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కానీ 317 జీఓ వల్ల మా మమ్మీ మాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కుల్‌కుల్‌ ఉన్నత పాఠశాలకు ట్రాన్స్‌ఫర్‌ అయింది.

అప్పటి నుంచి మాకు పెద్ద కష్టమొచ్చింది. నేను లేవకముందే మమ్మీ వెళ్తుంది. రాత్రి పడుకున్నాక వస్తుంది. సెలవు రోజుల్లోనే మా మమ్మీని చూస్తున్నా.. జడ వేయడానికి టైమ్‌ ఉండటం లేదని జుట్టు కట్‌ చేయించింది. కేసీఆర్‌ తాతా... మా మమ్మీ, డాడీని ఒకే జిల్లాలో పనిచేసేలా చూడు ప్లీజ్‌. లాంగ్‌ జర్నీ వల్ల మా మమ్మీ హెల్త్‌ దెబ్బతింటుంది. ప్లీజ్‌ కన్సిడర్‌..  

గజ్వేల్‌: 317 జీఓ కారణంగా వివిధ ప్రాంతాలకు బదిలీ అయిన ఎంతో మంది ఉద్యోగ, ఉపాధాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేకాక, వారి పిల్లల కష్టాలకు శ్రీనిత వేడుకోలు నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఆదివారం జరిగిన స్పౌజ్‌ ఉపాధ్యాయ, ఉద్యోగుల సభ ఆద్యంతం ఉద్విగ్నం, ఉద్వేగ పరిస్థితుల మధ్య సాగింది.

తమ సమస్య ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో గజ్వేల్‌ను వేదికగా చేసుకొని కేసీఆర్‌ ఫొటోను బ్యానర్‌గా పెట్టుకొని మరీ ఈ సభను ఏర్పాటు చేశారు. స్పౌజ్‌ బదిలీలను ప్రభుత్వం బ్లాక్‌ చేసిన సిద్దిపేటతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల, హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ సభ నిర్వహించారు.

సభలో పలువురు మహిళా టీచర్లు, ఉద్యోగులు మాట్లాడుతూ 317 జీఓ వల్ల సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యామని, సీఎం కేసీఆర్‌.. ఖాళీలున్న జిల్లాల్లో వెంటనే స్పౌజ్‌ బదిలీలు చేపట్టాలని ఆదేశించినా, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని, అందువల్ల తాము కుటుంబాలకు దూరమవుతున్నామని కంటతడి పెట్టుకున్నారు. బాధితుల సంఘం అధ్యక్షుడు వివేక్, ప్రధాన కార్యదర్శి నరేశ్‌లు మాట్లాడుతూ 317 జీఓ వల్ల వేర్వేరు జిల్లాలకు బదిలీ అయిన వారిని తమ సొంత జిల్లాలకు కేటాయించాలని సీఎం ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

13 జిల్లాల్లో స్పౌజ్‌ బదిలీలు నిలిచిపోవడం వల్ల దాదాపు 2,300 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు వాపోయారు. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో పనిచేయాల్సి రావడం వల్ల వారి కుటుంబాలు తీవ్రమైన ఆవేదనలో ఉన్నాయని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సభలో స్పౌజ్‌ బాధితుల సంఘం సభ్యులు ఎ.మల్లికార్జున్, ఖాదర్, త్రివేణి, అర్చన, గడ్డం కృష్ణ, బాలస్వామి, మహేశ్, ప్రవీణ్, చంద్రశేఖర్, దామోదర్, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌