amp pages | Sakshi

పంచాయతీలకు ‘కరెంటు’ షాక్‌

Published on Wed, 05/11/2022 - 01:20

సాక్షి, హైదరాబాద్‌: పెరిగిన కరెంటు చార్జీలు గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారుతున్నాయి. అంతగా ఆదాయం లేని పంచాయతీలు, ఇతర చిన్న పంచాయతీలకు అసలు కరెంట్‌ చార్జీలు కట్ట డమే సమస్యగా ఉండగా తాజాగా పెరిగిన చార్జీ లతో మరింత భారం పడింది. తాజాగా పెరిగిన విద్యుత్‌ చార్జీలతో గతంలో కంటే 15–20 శాతం దాకా బిల్లులు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.

దీంతో తగినన్ని సొంత ఆదాయ వనరులు, నిధులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచ రంగా తయారైంది. నేరుగా అందే 15వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో సింహభాగం విద్యుత్‌ చార్జీలు చెల్లించేందుకే సరి పోతోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు, ఏవైనా మరమ్మతులు చేపట్టాలంటే నిధులు సరిపోవడం లేదని చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చిన వెంటనే వాటి నుంచి అప్పటికప్పుడే కరెంటు బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో.. నిధులు ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటు న్నట్టుగా తయారైందని అంతగా ఆదాయం లేని పంచాయతీల సర్పంచ్‌లు వాపోతున్నారు. 

అసలే ఆదాయం తగ్గి..
ఇసుక మైనింగ్, సీనరేజీ, భూముల విక్రయం, స్టాంప్‌ డ్యూటీల వసూలు ఇతర రూపాల్లో వచ్చే ఆదాయాన్ని రాకుండా చేయడంతో గ్రామ పంచా యతీలకు ఇప్పటికే ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కరెంట్‌ చార్జీల పెంపుతో నిధులు కరువై ఎటూ పాలుపోవడం లేదని సర్పంచ్‌లు అంటున్నారు. గతంలో ఇద్దరు పారి శు«ధ్య కార్మికులతో పార్ట్‌టైంగా పని చేయించుకుని రూ.2 వేల చొప్పున చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు ఇద్దరికి నెల కు రూ.8 వేల చొప్పున చెల్లించాల్సి రావడంతో అది కూడా భారంగా మారిందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో గతం లో మాదిరి ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కరెంట్‌ చార్జీలు భారంగా మార డంపై అభిప్రాయం చెప్పేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారు లెవరూ అందుబాటులోకి రాలేదు.

పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి
పంచాయతీలకు ముందే కరెంట్‌ చార్జీలు కట్ట గలిగే ఆర్థికస్తోమత లేదు. ఇప్పుడు కరెంట్‌ బిల్లులు పెరగడంతో మరింత భారం పడుతోంది. అందువల్ల ప్రభుత్వమే ఈ బిల్లులు చెల్లించాలి. కాంగ్రెస్‌.

టీడీ పీల హయాంలో పంచాయతీల కరెంట్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తర్వాత వీధిలైట్లకు తక్కువ పర్సంటేజీతో చార్జీలు తీసుకునేవారు. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు బిల్లులు కట్టే అవకాశ ముండేది. ఇప్పు డలా లేదు. పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి. 
– చింపుల సత్యనారాయణరెడ్డి,  అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌

బోర్ల వినియోగంతో బిల్లులు భారం
వీధిలైట్ల బిల్లుల చెల్లింపుతో పాటు మిషన్‌ భగీరథ నీళ్ల సరఫరా సరిగా లేక బోర్లు వినియోగించాల్సి రావడంతో ఆ బిల్లుల చెల్లింపు భారంగా మారింది. ఇదిగాక వినాయకచవితి, బతుకమ్మ, దసరా, మైసమ్మ, పోచమ్మ ఇతర పండుగలు, పబ్బాలు, జాతర్లకు, కార్యాలకు అదనంగా లైట్లు పెట్టక తప్పని పరిస్థితి ఉంది.

దీంతో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు కలుపుకొని నెలకు రూ.లక్ష చిల్లర ఆదాయం వస్తుంది. అందులో రూ.15–20 వేల దాకా కరెంట్‌ బిల్లులు కట్టాల్సి వస్తోంది. 
– ఉప్పల అంజనీ ప్రసాద్, గోలిరామయ్యపల్లి సర్పంచ్, కరీంనగర్‌ జిల్లా  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)