amp pages | Sakshi

నిమజ్జనంపై నియంత్రణ ఉండాలి: హైకోర్టు

Published on Wed, 09/01/2021 - 14:05

సాక్షి, హైదరాబాద్‌: రానున్న వినాయకచవితిని పురస్కరించుకొని గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. గణేశ్‌ మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు నియంత్రణ చర్యలుండాలని, ఈ మేరకు ఆంక్షలు విధించాలని సూచించింది. మండపాలలో ఏర్పాటు చేసే లౌడ్‌స్పీకర్లతో శబ్దకాలుష్యం, విగ్రహాల నిమజ్జనం కారణంగా ఏర్పడే జలకాలుష్యంతో ఇతరులు ఇబ్బందిపడతారని, ఒకరి మతవిశ్వాసాల కోసం ఇంకొకరిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదని తేల్చిచెప్పింది. కరోనా ఆంక్షల నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, మండపాల దగ్గర, నిమజ్జనం సమయంలో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో విగ్రహాల నిమజ్జనం ఎక్కడికక్కడ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్‌ దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ‘భక్తులను నియంత్రించడం అంత సులభమేమీ కాదని మాకు కూడా తెలుసు, అయినా కోర్టు ఆదేశాలను చూపించి నియంత్రణ చర్యలు చేపట్టాలి’అని సూచించింది. మండపాల ఏర్పాటు మొదలు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ), పీసీబీ, గణేశ్‌ ఉత్సవ సమితి, పిటిషనర్లను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది.
 
50 వేల విగ్రహాలు ఎలా సరిపోతాయి ? 
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 50 వేల ఉచిత గణేశ్‌ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ హైకోర్టుకు నివేదించారు. ఎవరికి వారు ఇంట్లోనే మట్టి వినాయకులను నిమజ్జనం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ‘జంటనగరాల జనాభా ఎంత, మీరిచ్చే 50 వేల ఉచిత విగ్రహాలు ఎలా సరిపోతాయి, విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేశాం, మన బాధ్యత అయిపోయిందని అనుకుంటే ఎలా’అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో భారీ విగ్రహాలు ఏర్పాటు చేయకుండా, మట్టివిగ్రహాలను ఏర్పాటు చేసేలా చూడాలని, సహజ రంగులనే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ కోరారు. అన్ని విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 16 ప్రత్యేక నీటికొలనులను నిర్మించారని, అయినా వాటిని వినియోగించుకోకుండా మెజారిటీ విగ్రహాలు హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తున్నారని తెలిపారు. 


పీసీబీ ఏం చేస్తోంది ? 
‘హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంపై కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అనేక సూచనలు చేసింది. వాటి అమలు తీరును పర్యవేక్షించడం మరిచింది. పీసీబీ సూచనలను ఇతర విభాగాల అధికారులు పాటించకపోతే వారిపైనా చర్యలు తీసుకోవచ్చు. అయినా ఎందుకు మౌనంగా ఉంటోంది’’అని పీసీబీ తరఫున హాజరైన న్యాయవాది శివకుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. హుస్సేన్‌సాగర్‌ ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండేదని, నిమజ్జనంతో కాలుష్య కాసారంగా మారిందని పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చే సమయంలోనే సమీపంలోని చెరువుల్లో నిమజ్జనం చేసేలా నిర్వాహకులకు తెలియజేయాలని సూచించింది.  



చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)