amp pages | Sakshi

కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?

Published on Tue, 12/12/2023 - 03:34

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు.  

రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి.

ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది.

అనర్హులను తొలగిస్తారా...? 
గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్‌ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు.

రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్‌ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?