amp pages | Sakshi

Bharat Jodo Yatra: తెలంగాణలో నవంబర్‌ 7న ముగింపు

Published on Tue, 10/18/2022 - 00:50

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇటీ­వల ఏఐసీసీ సంస్థాగ­త వ్యవహారాల ఇన్‌చా­ర్జి కె.సి.వేణుగోపాల్‌ సమక్షంలో జరిగిన సమావే­శంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఈ నెల 23 నుంచి నవంబర్‌ 6 వ­రకు ఈ యాత్ర జరగాల్సి ఉంది. కానీ, తాజామార్పుల ప్రకారం యా­త్ర రాష్ట్రంలో నవంబర్‌ 7న ముగియనుంది.

తాజా షెడ్యూల్‌ ప్ర­కారం.. ఈ నెల 23న ఉద యం 11 గంటలకు నారా­య­ణ­­పేట జిల్లా కృష్ణా మండలం గూడబెల్లూరులో రాహుల్‌గాంధీ తెలం­గా­­ణలో ప్రవేశి­స్తారు. అక్కడి నుంచి మక్తల్‌ వరకు ఆ రోజు యాత్ర సా­గిస్తారు. ఆ తర్వాత దీపావళి సం­­దర్భంగా 3 రోజులు యాత్రకు విరామం ఇచ్చి, 27న మక్తల్‌ నుంచి తిరిగి ప్రారంభిస్తారు. ఆరోజు నుంచి నవంబర్‌ 3 వరకు యాత్ర జరగనుండగా, 4న  విరామం తీసుకోనున్నారు.

మళ్లీ  5న మెదక్‌ జిల్లా అందోల్‌ నియోజకవర్గం చొట్కూరు వద్ద యాత్రను ప్రారంభించి 7వ తేదీ సాయంత్రం ఏడుగంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని షాపూర్‌ మీర్జాపూర్‌ హనుమాన్‌ గుడి వద్దకు చేరుకోవడంతో యాత్ర రాష్ట్రంలో ముగియనుంది. అక్కడి నుంచి ఆయన మహా­రాష్ట్రకు వెళతారు.  

ఫారెస్ట్‌లో.. పది కిలోమీటర్లు
తాజా షెడ్యూల్‌ ప్రకారం రాహుల్‌ గాంధీ పది కిలోమీటర్ల మేర రిజర్వ్‌ ఫారెస్టు ప్రాంతంలో యాత్ర చేయనున్నారు. నవంబర్‌ 7న ఉదయం జగన్నా­థపల్లెలోని జుక్కల్‌చౌరస్తా వద్ద యాత్రను ప్రారంభించనున్న రాహుల్‌ గాంధీ, రిజర్వ్‌ ఫారెస్టు గుండా ప్రయాణించి షాపూర్‌గేట్‌ వద్దకు చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకోనున్నారు. రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో 11 చోట్ల జరిగే (కార్నర్‌ మీటింగ్‌లు) సమావేశాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)