పెరిగిన సిమెంట్‌ ధరలపై 27న మళ్లీ భేటీ

24 Apr, 2017 15:03 IST|Sakshi

విజయవాడ: పెరిగిన సిమెంట్‌ ధరలపై కంపెనీల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం సోమవారం సమావేశమైంది. మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో  సబ్‌ కమిటీ జరిగింది. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనీసం రూ.60 తగ్గించాలని తాము సిమెంట్‌ కంపెనీ ప్రతినిధులను కోరినట్లు తెలిపారు.

ఈ నెల 27న మళ్లీ సమావేశం అవుతామన్నారు. సిమెంట్‌ ధరలు తగ్గించడానికి అంగీకరించకపోతే ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ రద్దు చేస్తామన్నారు. పంచాయతీరాజ్‌ పనులకు రూ.230, ఆర్‌అండ్‌బీ పనులకు రూ.240, పోలవరం పనులకు రూ.250 బస్తా సిమెంట్‌ సరఫరా చేసేందుకు కంపెనీలు అంగీకరించాయని తెలిపారు. అలాగే సామాన్యులకు అమ్మే సిమెంట్‌ మాత్రం రూ.390 వరకూ పెంచారని వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు