కేంద్రానికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

11 Jun, 2020 12:43 IST|Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని రప్పించేందుకు మరిన్ని విమానసర్వీసులను నడపాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్‌, సింగపూర్‌ దేశాల్లో ఎక్కువ మంది తెలుగువారు చిక్కుకుపోయారని వారందరినీ తరలించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు సీఎం జగన్‌ గురువారం లేఖ రాశారు. కాగా విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్‌’ ద్వారా ప్రత్యేక విమానాలను నడిపిన విషయం తెలిసిందే.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు