ఇంతకీ వారెవరు ?

18 Apr, 2015 01:29 IST|Sakshi

బెజవాడలో నలుగురిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ?

విజయవాడ: విజయవాడలోని పాతబస్తీ, భవానీపురం ప్రాంతాలకు చెందిన నలుగురు యువకుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), రాష్ట్ర నిఘా వర్గాలు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వీరెరవనే విషయమై స్థానిక పోలీసులు నోరు మెదపడం లేదు. ప్రస్తుతం ఈ నలుగురినీ అధికారులు ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారని తెలిసింది. నల్లగొండ జిల్లా అర్వపల్లి ‘సిమి’ ఉదంతం నేపథ్యంలో ఉగ్రవాదుల కన్ను విజయవాడపై ఉన్నట్లు వెలుగులోకొచ్చింది. దీంతో  రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ, నిఘా వర్గాలు నగరంపై డేగకన్ను వేశాయి.

ఎన్‌ఐఏ, నిఘా విభాగాలతో కూడిన ప్రత్యేక సంయుక్త బృందం దాదాపు వారం క్రితం ఇక్కడికి వచ్చింది. నగరంలోని పాతబస్తీతోపాటు భవానీపురం ప్రాంతానికి చెందిన 22 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిని పలు కోణాల్లో విచారించిన తరువాత 18 మందిని విడిచిపెట్టింది. మిగిలిన నలుగురినీ మాత్రం రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలిసింది.  వీరంతా సిమి లేదా ఐఎస్‌ఐఎస్‌కి చెందినవారనే కోణాల్లోనే  విచారణ సాగుతున్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు