బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?: వరుదు కళ్యాణి

18 Nov, 2023 13:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ సాధికార బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. శనివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. బీసీల తోకలు కట్‌ చేస్తానని చంద్రబాబు.. బీసీలను అవమానించారన్నారు.

అసలు బీసీల గురించి మాట్లాడే హక్కు అచ్చెన్నాయుడికి వుందా?. టీడీపీ బీసీ మంత్రులు జయం జయం చంద్రన్న అంటూ భజన చేశారు. బీసీలను చంద్రబాబు బెదిరించినప్పుడు మీరు ఎక్కడ వున్నారు?. రాజ్యసభకు మీ పార్టీ ఎవరినైనా పంపించిందా ?. బీసీ జడ్జిలు వద్దని చంద్రబాబు లేఖ రాసినప్పుడు మీరు ఎక్కడ వున్నారు? అంటూ కల్యాణి ప్రశ్నించారు.

‘‘టీడీపీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేక జనసేన, బీజేపీ, మిగిలిన పార్టీల కాళ్లు పట్టుకుంటున్నారు. బీసీల అభివృద్ధికి కులగణన అవసరం అంటే.. టీడీపీ ఎందుకు అడ్డుకుంటుంది. రాజ్యాంగ సూచనకు మించి ఏపీలో బీసీలకు మేలు జరిగింది. బీసీలకు సీఎం జగన్‌ బ్యాక్‌బోన్‌గా నిలిచారు’’ అని వరుద కళ్యాణి అన్నారు.
చదవండి: బోగస్‌ ఇన్వాయిస్‌లతో ‘స్కిల్‌’ నిధులు స్వాహా


 

మరిన్ని వార్తలు