జాతీయస్థాయి చేతిరాత నిపుణుడిగా భువనచంద్ర

9 Dec, 2017 01:45 IST|Sakshi

భవానీపురం (విజయవాడ పశ్చిమ): భారతదేశంలో అందమైన దస్తూరి నేర్పే 36 మంది చేతిరాత నిపుణుల్లో ఒకరిగా విజయవాడకు చెందిన పి.భువనచంద్ర ఎంపికయ్యారు. సెంట్రల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ పంపిన ఉత్తర్వులు ఇటీవల తనకు వచ్చాయని భువనచంద్ర శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. తనను ‘ప్రొఫెసర్‌ ఇన్‌ కేలిగ్రాఫీ ఆల్‌ ఓవర్‌ ఇండియా’గా సిఫార్సు చేస్తూ నియమించినట్లు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎస్‌.వరదరాజన్‌ తనను ప్రశంసిస్తూ రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లోని విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ ఇచ్చేందుకు సిఫార్సు చేస్తూ ఈ ఏడాది జూన్‌ 14వ తేదీన ఒక లేఖ తనకు పంపించారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు