‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ 

23 Sep, 2019 10:41 IST|Sakshi

మా వాళ్ల...జాడేదీ

∙ప్రభుత్వాసుపత్రిలో కొనసాగుతున్న ఆర్తనాదాలు

గల్లంతైన వారి మృతదేహాల కోసం

బంధువుల ఎదురుచూపులు

సాక్షి , రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎటునుంచి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా అందులో తమవారి మృతదేహం వచ్చిందేమోనని ఆశతో పరుగులు తీయడం పలువురిని కలచి వేస్తోంది.  

‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ 
బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు మంచిర్యాల గ్రామానికి చెందిన కాకునూరు రమ్యశ్రీ ఇంజినీర్‌ చదివి  హైదరాబాద్‌లోని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. తండ్రిపై ప్రేమతో తన చేతిపై ‘డాడీ’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనిని తలుచుకుంటూ రమ్యశ్రీ తండ్రి సుదర్శన్‌ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఉద్యోగం వచ్చింది కదా డాడీ...అమ్మ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుతున్నానని’ చెప్పిన తన చిట్టి తల్లి విహార యాత్రకు వచ్చి కనీసం కడచూపుకు కూడా నోచుకోకుండా చేస్తుందని అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి సుదర్శన్‌ బోరున విలపిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి, తండ్రి దర్శన్, కలసి కంటతడిపెట్టుకున్నారు. తమ కుమార్తె మృతదేహం కోసం ఎనిమిది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తునే ఉన్నారు.

చదవండి: రమ‍్య కోసం ఎదురుచూపులు

నా తండ్రి ఆచూకీ తెలపండి
బోటు డ్రైవర్‌ నూకరాజు కుమారుడు ధర్మారావు, బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. తన తండ్రికి బోటు నడపడంలో నైపుణ్యం ఉందని, ఇలా జరిగిందని, తమ తండ్రి మృతదేహం ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మరో డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ కుటుంబీకులు కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు. 

మా మేనల్లుడేడండీ
బోటు ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచీ హైదరాబాద్‌ ఉప్పల్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్‌ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. తన మేనల్లుడు అంకెం పవన్‌ కుమార్, అతని భార్య అంకెం భవానీల ఆచూకీ తెలియజేయాలంటూ వేడుకుంటున్నాడు. ఆదివారం రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి రోదిస్తుండగా అక్కడకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్‌ తన కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దుఖాన్ని దిగమింగుకోవాలని సముదాయించిన తీరు అక్కడున్నవారికి కన్నీళ్లను రప్పించింది. 

మా  కుమారుడి ఆచూకీ చెప్పరూ
బోటులో సహాయకుడిగా పని చేసిన పాతపట్టి సీమకు చెందిన మణికంఠ ఆచూకీ చెప్పరూ అంటూ అతని తండ్రి నరసింహారావు,  బాబాయిలు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. అంబులెన్స్‌ వచ్చిందంటే దానిలో మృతదేహాలు ఉంటాయేమో అని పరుగులు తీసుస్తున్నారు. 

మేనల్లుడి కోసం...
విహారయాత్రలో కుటుంబం మొత్తం గల్లంతుకాగా అందులో బావమరిది, అతని భార్య, కుమార్తెల మృతదేహాలు లభ్యమైనా మేనల్లుడు కర్నూల జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి(6) మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదని అతని మేనమామ చంద్రశేఖరరెడ్డి ఎదురుచూస్తున్నాడు. ఇంటి నుంచి తన మామ అస్తమానూ ఫోన్‌ చేస్తున్నాడని ఏమి సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.  

చదవండిఇంకా విషాదంలోనే... లభించని రమ్య ఆచూకీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షెడ్యూల్‌ మారింది..

‘బీపీఎస్‌’పై అధికారుల నిర్లక్ష్యం

టీడీపీ నేత దా‘రుణం’

హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం జగన్‌

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..

బాబు ఇంటిని కూల్చేస్తున్నారని ఎల్లో మీడియా దుష్ప్రచారం

డెప్యూటేషన్‌.. వసూళ్ల యాక్షన్‌!

సాగర్‌ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేత  

కలప అక్రమ తరలింపుపై విచారణ

మెరిట్‌ జాబితాపై  కసరత్తు

పల్లె చదువులు దైన్యం..పట్నానికి పయనం

ఏపీ పోలీస్‌ హౌసింగ్‌.. సరికొత్త రికార్డు

అదిగదిగో చేప..!

లైఫ్‌ జాకెట్లు తీసేయడం వల్లే ప్రాణగండం

మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అంతిమ వీడ్కోలు

విశాఖ ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్‌

ఆ పత్రికపై చర్యలు తీసుకోవాలి

నేడు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఒకే అభ్యర్థి.. 3 జిల్లా ర్యాంకులు

కత్తులతో టీడీపీ వర్గీయుల దాడి

29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు 

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ

వివిధ కేటగిరీల్లో టాప్‌ 15ర్యాంకులు

బోటు ప్రమాదంపై కిషన్‌రెడ్డి సమీక్ష

రాధాకృష్ణా.. ‘ఓపెన్ హార్ట్’ ఉందా?

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబుకు లేఖ రాసే అర్హత ఉందా...?

'రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు'

ఆరుగురికి సబ్‌ కలెక్టర్లుగా పోస్టింగులు

‘ఆరోగ్యశ్రీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!