మెడికల్ పీజీ స్కాంపై సీఐడీ నివేదిక

29 Mar, 2014 17:03 IST|Sakshi

హైదరాబాద్: మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో తేలింది. ప్రాథమికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్‌ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్‌ మహేందర్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం శనివారం గవర్నర్ నరసింహన్ను కలిశారు.

పీజీ మెడికల్ స్కాంపై విచారణ నివేదికను గవర్నర్కు సమర్పించారు. పీజీ మెట్ను రద్దు చేయాలని సీఐడీ చీఫ్ గవర్నర్కు సూచించినట్టు సమాచారం. పీజీ మెట్‌ పరీక్ష రద్దుచేయాలా? వద్దా? అన్న విషయంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు