రోడ్డు ప్రమాదంలో సివిల్ ఇంజనీర్ మృతి

6 Nov, 2014 01:49 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో సివిల్ ఇంజనీర్ మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
 
 తాడేపల్లి రూరల్ :
 గురుపౌర్ణమి కోసం పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్లి వస్తున్న నలుగురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో సివిల్ ఇంజినీర్ మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తాడేపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుంటూరు, ఆర్ అగ్రహారం, రామనామక్షేత్రానికి చెంది న తమ్మిన నాగ వెంకట శబరీష్ కుమార్ (23) చెన్నైలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

సెలవుపై ఇంటికి వచ్చిన ఆయన బుధవారం స్థానికులు తమ్మిశెట్టి తిరుపతిరావు, మల్లే శ్రీదేవి, సంకా రాజ్యలక్ష్మిలతో కలిసి కారులో విజయవాడకు వెళ్లాడు. గురువారం కార్తీక పౌర్ణమి కావడం తో అం దుకు కాల్సిన సా మగ్రి కొనుగోలు చేసి తిరుగు పయనమయ్యారు. కుంచనపల్లి బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కారు నడుపుతున్న వెంకట శబరీష్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెం దాడు. మిగతా ముగ్గు రు మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను అకస్మాత్తుగా చూసిన శబరీష్ షడన్‌గా బ్రేకు వేయటంతో కారు పూర్తిగా ధ్వంసమైందని, 30 అడుగుల మేర కారు ఈడ్చుకుంటూ వెళ్లి, పల్టీలు కొడుతూ ఎక్స్‌ప్రెస్ రోడ్డు మధ్యలోనున్న గార్డెన్‌లో పడి ఆగిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు