ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

9 May, 2020 12:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 43 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,930కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,338మంది శాంపిల్స్‌ పరీక్షించగా.. అందులో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 16,చిత్తూరు జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 6, విశాఖపట్నం జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.  

 కరోనాతో ఇవాళ మరో ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 44కు చేరింది. అందులో కృష్ణా నుంచి ఇద్దరు, కర్నూల్‌ నుంచి ఒకరు మరణించారు. శనివారం కొత్తగా 45 మంది డిశ్చార్జ్‌ కావడంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 887కి చేరింది. డిశ్చార్జి అయిన వారిలో కర్నూలు జిల్లా నుంచి 27 మంది, కృష్ణాలో 8మంది, తూర్పు గోదావరి నుంచి ముగ్గురు, అనంతపురం నుంచి ఇద్దరు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 999 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఏపీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఇప్పటివరకు 1,65,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు కూడా 1.17 శాతానికి తగ్గింది.

మరిన్ని వార్తలు