హారర్‌ చిత్రంలో చైతూ.. డైరెక్టర్‌ అతడేనా?

9 May, 2020 12:39 IST|Sakshi

వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అక్కినేని యువ కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం దర్శకుడు శేఖర్‌ కమ్ముల రూపొందిస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం చేస్తున్నాడు. ‘లవ్‌స్టోరీ’ తర్వాత ‘మనం’ డైరెక్టర్‌ విక్రమ్‌ కుమార్‌ డైరెక్షన్‌లో చైతూ ఓ మూవీ చేస్తారనేది సినీ వర్గాల్లో ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్త.  వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే చిత్రం హారర్‌ జానర్‌లో తెరకెక్కనుందని సమాచారం. అది కూడా గతంలో వచ్చిన హారర్‌ చిత్రానికి సీక్వెల్‌ అని తెలుస్తోంది. 

గతంలో విక్రమ్‌ కుమార్‌ మాధవన్‌తో తీసిన ‘13 బీ’ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించనున్నారని అంటున్నారు. హారర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘13 బీ’ చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం అందుకుంది. నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్ర కావడంతో చైతూ ఈ సీక్వెల్‌లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడన అంటున్నారు. అయితే అటు దర్శకుడు నుంచి గాని ఇటు హీరో నుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దిల్‌రాజ్‌ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అని టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు ప్రచారం సాగుతోంది. 

ప్రసుతం వరుస సినిమాలతో చైతూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. నాగార్జున టైటిల్‌ రోల్‌లో కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక పరుశురామ్‌ ‘నాగేశ్వర్‌రావు’ చిత్రం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. అంతేకాకుండా తాజాగా ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చెప్పిన కథకు పచ్చ జెండా ఊపడంతో ఈ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది. 

చదవండి:
మే 9 వెరీ స్పెషల్‌ డే ఎందుకంటే?
పెయింటింగ్‌... కుకింగ్‌.. డ్యాన్సింగ్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు