సిఆర్డిఏ బిల్లుని ఆమోదించిన ఏపీ శాసనసభ

22 Dec, 2014 22:57 IST|Sakshi
సిఆర్డిఏ బిల్లుని ఆమోదించిన ఏపీ శాసనసభ

హైదరాబాద్:   కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ఈరోజు శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించారు.  బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది.

గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు. 17 చాప్టర్లు, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు.

మరిన్ని వార్తలు