బరువు పెరిగితే రిస్కే

18 Jul, 2020 05:01 IST|Sakshi

సాక్షి, అమరావతి: తాజా పరిస్థితుల్లో శరీర బరువు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యాయామం చేసి శ్రమించడం వల్ల శరీరం అలసట నుంచి బయటపడాలి. కానీ.. మోయలేని భారంతో శరీరం ఎప్పుడూ శ్రమకు గురి కాకూడదు. బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉంది. ఎత్తుకు మించి బరువు పెరిగితే ఆహార నియమాలు లేదా వ్యాయామం పాటించి జాగ్రత్త వహించాలి. తాజాగా కరోనా వచ్చే హై రిస్క్‌ కారణాల్లో ఊబకాయం ఒకటని వైద్యులు చెబుతున్నారు. ఎత్తుకు తగినట్టు బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. 

► తాజా గణాంకాల ప్రకారం మధుమేహం, హైపర్‌ టెన్షన్‌ తర్వాత ఊబకాయం హైరిస్క్‌ కేటగిరీలో ఉంది.బాడీ మాస్‌ ఇండెక్స్‌ ప్రకారం 25 కంటే తక్కువగా ఉంటే సరైన బరువున్నట్టు లెక్క. 
► 30 కంటే ఎక్కువగా ఉంటే మెల్లిగా రిస్కులోకి వెళుతున్నట్టు సూచన. 
► 35కు మించి ఉంటే బాగా రిస్కులో ఉన్నామని గమనించాలి. 
► ప్రస్తుతం కోలుకుంటున్న వారిని పరిశీలిస్తే.. డయాబెటిక్, హైపర్‌ టెన్షన్, అధిక బరువు ఉన్న వారు కోలుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఊబకాయం ఉన్న వారిలో అవయవాలు (ఆర్గాన్స్‌) 
పరిమితంగా (రిజర్వుడుగా) పనిచేస్తాయి. 

మరిన్ని వార్తలు