తిరుమలలో ‘డ్రోన్‌’ కలకలం

8 Oct, 2017 04:46 IST|Sakshi

పక్షిని ఢీకొని చెట్టుపై పడిన డ్రోన్‌ కెమెరా

సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది. శేషాచలంతోపాటు తిరుమలకొండ మీద ఉద్యాన వనాల అభివృద్ధి కోసం నెల రోజులుగా డ్రోన్‌ కెమెరాతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా ఆలయ నాలుగు మాడ వీధులు, సమీప ప్రాంతాలు మినహా మిగిలిన అటవీ, కాటేజీ ప్రాంతాల్లో ఈ సర్వే చేసుకునేందుకు టీటీడీ అనుమతినిచ్చింది.

ఏపీ అర్బన్‌ గ్రీన్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో బెంగళూరుకు చెందిన జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ ఎఫ్‌) నిపుణుల బృందం ఈ సర్వే నిర్వహిస్తోంది. డ్రోన్‌ కెమెరాను పక్షి ఢీకొనడంతో సిగ్నల్స్‌ తెగిపోయి డ్రోన్‌ కెమెరా స్థానిక శేషాద్రినగర్‌లోని ఓ చెట్టుపై ఇరుక్కుంది. స్థానికుల సమాచారంతో టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు డ్రోన్‌ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు