చెల్లెమ్మా పురంధేశ్వరి!.. ఎంపీ విజయసాయి పొలిటికల్‌ కౌంటర్‌

16 Nov, 2023 11:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరికి వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. చంద్రబాబు విషయంలో మీరు చేస్తున్న పనికి.. భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అని ప్రశ్నించారు. మీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా?’.

ఇదే సమయంలో..‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి గారూ. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: ‘జగన్‌ జైత్రయాత్రను ఆపేశక్తి ఎవరికీ లేదు’.. 

మరిన్ని వార్తలు