ఫోను వచ్చిందా... సొత్తు గోవిందా!

5 Sep, 2015 00:13 IST|Sakshi

బొబ్బిలి రూరల్: ‘బ్యాంక్ సే బాత్ కర్ రహాహూ... ఆప్‌కా ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాసే యహాతక్ నహీ కియా.... ఆధార్ నంబర్ బతాయియే..’ అంటూ కాల్ వచ్చిందా మీ సొత్తుకు ఎవరో టెండర్ పెడుతున్నట్టేనని పోలీసులు చెబుతున్నారు.  ‘ఆప్‌కా ఏటీఎంకా సోలహ్ ఆంక్ బతాయియే..’(మీ ఏటీఎంపై ఉన్న 16అంకెలు చెప్పండి..) అంటూ తరువాత పిన్ నంబర్ మారుతుంది. మీకు మూడు మెసేజ్‌లు వస్తాయని ఫోన్‌లో చెబితే అది కచ్చితంగా మోసమేనని, అలాంటి ఫోన్‌‌సకాల్స్‌కు వీలైనంత దూరంగా ఉండాలని, అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఆన్‌లైన్ నేరాలు ఎక్కువైపోతున్నాయి.
 
  ప్రతి ఒక్కరి వద్దా ఏటీఎం ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏటీఎం నంబర్లు తెలుసుకుని దుండగులు ఖాతాదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల ఓ ఇద్దరు ఇలా మోసపోయారు కూడా. వారి ఏటీఎంల నుంచి 5వేల రూపాయలు, ఒకరి ఏటీఎం నుంచి కొద్దిమొత్తం పోయినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఏటీఎంల నుంచి మన ఏటీఎం నంబర్, పిన్ నంబర్ మనతోనే చెప్పించి మోసం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్‌తో మన ఏటీఎం ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. మన ఏటీఎం కార్డు, పిన్‌నెంబర్ ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసులు  సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా ఆధార్, ఏటీఎం నెంబర్లు అడిగితే ఒకటికి పదిమార్లు కన్‌ఫర్మ్ చేసుకుని వివరాలు వెల్లడిస్తే మోసపోకుండా ఉండవచ్చని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు