అశోకుడు-షాజహాను | Sakshi
Sakshi News home page

అశోకుడు-షాజహాను

Published Sat, Sep 5 2015 12:12 AM

అశోకుడు-షాజహాను - Sakshi

అక్షర తూణీరం
 

ఇది గత పాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్ రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్ రోడ్డులో తిరిగి వస్తోందని చెబుతున్నారు.
 
వానాకాలం సమా వేశాలన్నప్పుడల్లా నాకు వానాకాలం చదువులు గుర్తుకొ స్తాయి. ఏ మాత్రం సాగని చదువుని వా నాకాలం చదువం టారు. ఏమాత్రం సాగని సమావేశాలు కాబట్టి వానాకాలం విశేష ణం సరిపోయింది. చెట్లకింద బడులు నడిచే రోజుల్లో ఈ సామెత పుట్టింది. పొరుగూరు పోయి చదువుకోవాలి కదా! వాగులు వంకలు అడ్డం వచ్చేవి. అయ్యవారు డొంకదారిలో రాలేకపోయేవారు. ఇలాంటి అనేకానేక అడ్డం కుల వల్ల బడి నడిచేది కాదు. ఏమాత్రం చదు వు అబ్బేది కాదు. ఇప్పుడు కూడా అంతే. వానాకాలం అసెంబ్లీ సెషన్‌లో ఊకదంపు, చెరిగిపోసుకోవడం, మాటల కంపు తప్ప ప్రజకి ఒక్క మంచి కూడా జరగలేదు. ప్రత్యక్ష ప్రసారాలు పుణ్యమా అని వినోదాన్ని మాత్రం ఉచితంగా పంచారు. అది మాత్రం ప్రజాసేవ కాదా అంటే, సరే అంటాం. ధన్య వాదాలు.

సీజన్ కదిలిపోతున్నా వానచినుకు లేదు. ఎందుకో కృత్రిమ వర్షాలకు, మబ్బు లు విత్తేందుకు ప్రయత్నం చేయడం లేదు. మామూలు గా అయితే చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల వాన కురవక పోయినా, కొన్నిచోట్ల కనక వర్షం కురుస్తుందని చెప్పు కోగా విన్నాను. ‘‘చూడండి! వర్షాలు లేకపోతే ఎంత అనర్థమో...’’ అన్నా డొక పెద్ద ప్రభుత్వాధికారి. నేను అయోమ యంగా చూశా. ‘‘వానలు లేకపోబట్టి కదా, పంటపొల్లాల్లో ఉండాల్సిన ఎలుకలు ప్రభుత్వ ఆస్పత్రులకు చేరింది...’’ అంటూ నిట్టూర్చా డు. వినాయక నిమజ్జనానికి కూడా ఆంధ్రాలో నీళ్లు లేవండీ అని ఒక పెద్దాయన వాపోయా డు. ‘‘మీకేం ఫర్వాలేదు. మనకు బంగాళాఖా తం ఉంది. అవసరమైతే విగ్రహాల తరలింపు బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం అయ్యేదాకా నేను నిద్ర పోనివ్వను’’ అంటూ నాయకుడు హామీ ఇచ్చే స్తాడని శ్రోత సముదాయించాడు.

 ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఒక పెద్దాయన తెగ బాధపడిపోతూ బాధకు కారణాలు చెప్పాడు. ఇంతకు ముం దు రాష్ట్రంలో ఏం జరిగినా ఒక్కటిగా సంతో షించడమో బాధపడడమో చేసేవాణ్ణి. రాష్ట్రం ముక్కలైంది గాని నా బుర్ర ముక్కలు కాలేదు. ఒకరు అశోక చక్రవర్తిలా చెరువులు తవ్విం చుట, చెట్లు నాటించుట చేసేస్తున్నారు. ప్రజల శ్రేయస్సుకై చీప్‌లిక్కర్ ప్రవేశపెడతానన్నారు. ప్రజలు ససేమిరా వద్దన్నారు. సరే, మీ శ్రేయ స్సు కోసం ప్రవేశ పెట్టను గాక పెట్టనన్నారు. ‘‘అవినీతిని తరిమికొట్టాం’’ అన్నారు. మరి ఎక్కడ చూసినా అదే కనిపిస్తోందేమని ప్రశ్ని స్తే-ఇది గతపాలకుల కుట్ర. నగరం చుట్టూతా రింగ్‌రోడ్డు వేశారు. మేం తరిమికొడుతుంటే, అవినీతి రింగ్‌రోడ్డులో తిరిగి వస్తోందని చెబు తున్నారు. ఇంకొకరు షాజహాన్ చక్రవర్తి తాజ్ మహల్‌ని నిర్మించినట్టు అమరావతిని నిర్మిస్తా నని తెరపై బొమ్మలు చూపిస్తున్నారు. తాజ్‌మ హల్ ప్రజల కడుపులు నింపలేదు. అమరా వతి కూడా సేమ్ టు సేమ్. ఇవన్నీ తలుచు కుంటూ ఆ పెద్దాయన రెండు బరువులు మో స్తున్న ఫీలింగ్‌తో తల పగిలిపోతోందంటాడు. కావచ్చు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఈ గొడవలేదు. అది తమిళం, మనం తెలుగు. ఇప్పుడేమో రెండూ తెలుగు రాష్ట్రాలైనాయి. చాలామంది విజయనగర్ కాలనీలో కూచుని విజయనగరం గురించి, విజయవాడ, విశాఖ గురించి ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం ఒక ప్రభుత్వానికి మూడు నాలుగు అపోజిషన్లు తగులుతున్నాయి. ఇవిగాక బీజేపీకి రాష్ట్రంలో ఎలాంటి పాత్ర పోషించాలో తెలియడం లేదు. చెప్పులోని రాయిలా, చెవిలోని జోరీగలా, ఇంటిలోని పోరులా.. కొన్నిసార్లు తయారవు తోంది. తెలుగు పెద్దాయనకు తలభారం తగ్గా లంటే అన్ని విధాల  వార్తలకూ దూరంగా ఉం డడమే మందు.
 
http://img.sakshi.net/images/cms/2015-09/51441392855_Unknown.jpg 
శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

Advertisement
Advertisement