బసవన్న రాజసం..రైతన్న సంబరం

18 Jun, 2019 08:13 IST|Sakshi
ఎద్దులను అలంకరిస్తున్న రైతు

సాక్షి, కర్నూలు : ఏరువాక పౌర్ణమి.. వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి సూచికగా పల్లెల్లో రైతులు సంబరంగా నిర్వహించుకునే సంప్రదాయ పండుగ. ఇందులో భాగంగా జిల్లాలో ముఖ్యంగా ఆదోని డివిజన్‌ పరిధిలోని పల్లెల్లో సోమవారం రైతులు వ్యవసాయ పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉంటున్న ఎద్దులకు రంగులద్ది, అలంకరణలతో సింగారించి వాటికి పూజలు చేశారు. తొలకరి చినుకులతో మొదలయ్యే ఖరీఫ్‌ సాగు పనులు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ ఆలయాల్లో పూజలు చేశారు.

దేవుళ్లకు నైవేద్యం సమర్పించారు. సాయంత్రం ఎద్దులతో పార్వేట ఉత్సవం నిర్వహించారు. గెలిచిన ఎద్దులను ఘనంగా ఊరేగించారు. వాటి యజమానులకు బహుమతులు అందించారు. మొత్తంగా ఏడాదికోసారి వచ్చే ఏరువాక పౌర్ణమి వేడుకలు పల్లెల్లో అంబరాన్నంటాయి. ఎమ్మిగనూరు మండలం గుడేకల్‌లో కాస్త వెరైటీగా పార్వేట సందర్భంగా యువకులు సినీ హీరోలు, రాజకీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు