దీపావళి పండుగలో తీవ్ర విషాదం

7 Nov, 2018 21:51 IST|Sakshi
మంటల్లో కాలిపోతున్న ఇళ్లు

సాక్షి, విజయనగరం : దీపావళి పండుగ పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సరదాగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకుందామనుకున్న వారికి అవే టపాసులు తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి.  టపాసులు పేలడంతో పలు చోట్ల ఇళ్లు దగ్ధమవ్వగా, మరికొన్ని చోట్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలోని జొన్న పలసలో దీపావళి సందర్భంగా టపాసులు పడి నిప్పంటుకుని నాలుగు తాటాకు ఇళ్లు మంటలకు ఆహూతి అయ్యాయి. మంటలు తీవ్రంగా వ్యాప్తిచే అవకాశం ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఎగసిపడుతున్న భారీ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
 

15మందికి తీవ్ర గాయాలు..
హైదరాబాద్‌ నగరంలో దీపావళి పండుగ వేడుకలో పలుచోట్ల అపశృతి చోటుచేసుకుంది. టపాసులు కాలుస్తూ ప్రమాదానికి గురైనవారిని సమీపంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నగరంలోని సరోజినిదేవి ఆసుపత్రికి ఇప్పటివరకు 15మంది బాధితులు చేరుకున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉండగా.. ఇద్దరికి కంటిచూపు పూర్తిగా పోయే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఆటోలో వెళ్తున్న 65 ఏళ్ల మైసమ్మకు రాకెట్‌ తగలడంతో కంటి వద్ద తీవ్ర గాయమైంది. మరికొన్ని చోట్ల టపాసులు పేలడంతో షాపులు కూడా పూర్తిగా కాలిపోయ్యాయి.

మరిన్ని వార్తలు