చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి

16 Nov, 2023 12:32 IST|Sakshi

ఏటూరునాగారం/మంగపేట: తమ ప్రేమను పెద్దలు అంగీకరించి పెళ్లి చేస్తారో లేరోనని మనస్తాపానికి గురైన ప్రేమికులు పురుగుల మందు తాగిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.. ఏటూరునాగారం మండలానికి చెందిన బెజ్జంకి వేణుగోపాల్, అరుణ దంపతుల కుమారుడు రాజేష్‌(25), మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మాదరి శిరీష(22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 

ఇద్దరూ ఏటూరునాగారం డిగ్రీ కళాశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో పెద్దలు తమ వివా హం చేస్తారో లేదో అని అపోహపడి మంగళవారం రాత్రి మల్లూరు గుట్ట వద్ద పురుగులమందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు.. వారిద్దరిని చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఈ ఘటనపై మంగపేట ఎస్సై రవికుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు