బతుకు పూలబాట.. కాదు

25 Nov, 2015 03:27 IST|Sakshi
బతుకు పూలబాట.. కాదు

బతుకు పూలబాట కాదు.. అది ఆడుకునే ఆట కాదు... అంటూ జీవిత సారాన్ని ఒక్కమాటలో తేల్చేశాడో సినీ కవి. ఈ సారాంశాన్ని వంటబట్టించుకున్నారీ కుర్రాళ్లు. చెరువుల్లో కమలాలను సాధారణ ప్రజలు మామూళ్లు రోజుల్లో పెద్దగా పట్టించుకోరు. అయితే వినాయకచవితి, దీపావళి తోపాటు ఇక కార్తీక మాసం వచ్చిందంటే తామర, కలువ పూలకు ఉన్న గిరాకీ వేరే చెప్పక్కర్లేదు. విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు సరిగ్గా ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. విజయనగరం నుంచి వచ్చి మండలంలోని సిరిపురం వద్ద తామరచెరువు, సంతకవిటి వద్ద ఈదులవాని చెరువు, మండాకురిటి వద్ద మహారాజావాని చెరువుల్లో ఇలా గాలి నింపిన ట్యూబ్‌లతో దిగి కలువ పూలను సేకరిస్తూ స్థానికులను ఆకట్టుకుంటున్నారు. చెరువుల్లో దిగి పూలను సేకరించడం కష్టమే అయినా.. జీవన యానం కోసం ఈ ప్రయాణం తప్పదంటున్నారు ఈ యువకులు.
                                                                                                 - సంతకవిటి
 

మరిన్ని వార్తలు