Atharva Trailer: 'అథర్వ' ట్రైలర్ లాంచ్.. ఆ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

15 Nov, 2023 20:51 IST|Sakshi

సస్పెన్స్, క్రైమ్ జానర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తీసిన సినిమా 'అథర్వ'. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా చేశారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా.. సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)

ట్రైలర్ చూశాక సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది. డైరెక్టర్, నిర్మాతతో పాటు సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు అతిథిగా విచ్చేసిన శశికిరణ్ తిక్క చెప్పుకొచ్చారు. ఇక మూవీలోని హీరోగా చేసిన కార్తీక్ రాజు మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు పూర్తి క్రెడిట్ డైరెక్టర్ మహేష్ రెడ్డికే చెందుతుంది. క్లూస్ టీం బ్యాక్‌డ్రాప్‌తో ఇంతవరకు సినిమా రాలేదు. డిసెంబర్ 1న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి' అని అన్నారు.

ట్రైలర్ చూపించిన దాని ప్రకారం.. తెలుగు హీరోయిన్‌తో పాటు నగరంలో మరో మూడు మర్డర్స్ జరుగుతాయి. అయితే హీరోయిన్ని చంపింది ఆమె బాయ్‌ఫ్రెండ్ అని పోలీసులు అనుకుంటారు. కానీ క్లూస్ టీంకి చెందిన హీరోకి మాత్రం హంతకుడు వేరే ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. దీంతో హంతకుడి కోసం వేట మొదలుపెడతాడు. మరి చివరికి పట్టుకున్నాడా లేదా అనేది తెలియాలంటే 'అథర్వ' సినిమా చూడాల్సిందే.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)

మరిన్ని వార్తలు