కాకినాడలో యువతిపై గ్యాంగ్‌ రేప్‌

9 Jul, 2019 10:23 IST|Sakshi

కాకినాడ క్రైం: కాకినాడ రాగంపేటకు చెందిన 19 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారంటూ యువతి తల్లిదండ్రులు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ రాగంపేటకు చెందిన యువతిపై అదే ప్రాంతానికి చెందిన దలాయి శ్యామ్‌కుమార్, బొబ్బిలి పృథ్వి, ఎన్‌.సాయికుమార్, ఈ సాయి అనే యువకులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో త్రీటౌన్‌ ఇన్‌చార్జి సీఐ రామ్మోహన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం నలుగురు ముద్దాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు