Bigg Boss 7 Day 68 Highlights: కన్నింగ్ గేమ్‍‌కి బలైన రతిక.. కోపంతో ఊగిపోయిన గౌతమ్

10 Nov, 2023 23:13 IST|Sakshi

బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్‌గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో మళ్లీ గొడవలు షురూ. శివాజీతో గౌతమ్ కొట్టుకుంటారేమో అనేంతలా రెచ్చిపోయాడు. కోపంలో అరుస్తూ గౌతమ్.. శివాజీ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. దీంతో అందరికీ శివాజీ నిజస్వరూపం ఇదేనా డౌట్ వచ్చింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో Day 68 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

అతి చేసిన రతిక
ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌసులోకి వస్తున్నారు. శుక్రవారం అలా తొలుత రతిక తండ్రి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రావడంతో రతిక గట్టిగా పట్టుకుని ఏ‍డ్చేసింది. ఇది కాస్త అతిలా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి రతిక ఎలిమినేట్ అయింది. దీంతో ఇంటికెళ్లి తల్లిదండ్రులని కలిసింది. దేవాలయాలకు కూడా తండ్రితో కలిసి వెళ్లినట్లు వీడియోలు పోస్ట్ చేసింది. ఇప్పుడేమో తండ్రి హౌసులోకి రాగానే తెచ్చిపెట్టుకున్నట్లు ఏడ్చేసింది. మళ్లీ వెంటనే ఏడుపు ఆపేసింది. బహుశా అందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టుకుని ఏడుస్తున్నారని రతిక కూడా ఏడ్చినట్లు అనిపించింది తప్పితే రియల్ ఎమోషనల్ కనిపించలేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?)

రైతుబిడ్డ తండ్రి ఆగయా
రతిక తండ్రి వెళ్లిన కాసేపటి తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. చేనులో పండిన బంతిపూలని తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చారు. అయితే నాన్న కోసం పొద్దున్నుంచి తినకుండా ఎదురుచూసిన ప్రశాంత్.. తండ్రితో కలిసి భోజనం చేశాడు. ఒకరికొకరు గోరుముద్దులు తినిపించుకోవడం చూడటానికి మంచిగా అనిపించింది. 'ఆట మంచిగా ఆడుకో, ఎవరివి ఏమనకు, నీ ఆట నువ్వు ఆడుకో' అని కొడుక్కి ధైర్యం చెప్పి ప్రశాంత్ తండ్రి వెళ్లిపోయారు.

రతిక కన్నింగ్ గేమ్
ఫ్యామిలీ వీక్ అయిపోయింది. దీంతో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'ఓ బేబీ' అని ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓవైపు టేబుల్ ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫొటోలు అతికించిన  బొమ్మలు ఉంటాయి. బజర్ మోగిన ప్రతిసారి ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు. ఇందులో వరసగా శోభా, ప్రశాంత్, యవర్, అమరదీప్, రతిక, అశ్విని, భోలె, ప్రియాంక, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ గేమ్‌లో కావాలనే మూడు నాలుగుసార్లు పరుగెత్తకుండా రతిక కన్నింగ్ గేమ్ ఆడింది. చివరకు ఐదో ప్రయత్నంలో ఆమె బొమ్మని ఎవరు పట్టుకెళ్లలేదు. దీంతో తను తీసిన గోతిలో తానే పడి బలైపోయింది.

(ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!)

శివాజీ vs గౌతమ్
ఇక చివరగా ముగ్గురున్నప్పుడు గౌతమ్ బొమ్మ శివాజీ తీసుకోవడంతో గౌతమ్.. ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో కావాలనే శివాజీ తన బొమ్మ పట్టుకున్నారని చెప్పి గౌతమ్ సీన్ క్రియేట్ చేశాడు. అన్యాయం జరిగిందని చెప్పి శివాజీతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మీదపడి మరీ అరుచుకున్నారు. 'ప్రతిసారి నీతో గోల, వాంటెడ్‌గా గొడవ పెట్టుకుంటావ్, ప్రతిసారి నీకు అటెన్షన్ కావాలి, అలానే గొడవ చేస్కో' అని శివాజీ అనేసరికి గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. 'మీకు కావాల్సినట్లు జరిపించండి, బిగ్‌బాస్‌తో మీరు మాట్లాడుకోండి. మీరు సెకండ్ బిగ్‌బాస్ అనుకుంటా, నేను కూర్చుని ఉంటాను' అనే శివాజీని ఉద్దేశిస్తూ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావ్' అని శివాజీ తిరిగి అనేసరికి గౌతమ్‌కి పట్టరాని కోపం వచ్చేసింది. మైక్ పక్కనబెట్టి.. వెళ్లిపోతా బిగ్‌బాస్, తలుపు తెరవండి అని గట్టిగా బాదుతూ సీన్ క్రియేట్ చేశాడు.

శివాజీ నిజస్వరూపం
గౌతమ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. శివాజీ, రెండో బిగ్‌బాస్‌లానే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే హౌసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దమనిషి తరహాలో అందరికీ నీతులు చెబుతూ, ప్రశాంత్-యవర్-భోలెతో ఓ బ్యాచ్ తయారు చేసుకుని ఏదేదో చేస్తున్నాడు. శివాజీ ఏం చేసినా సరే వీకెండ్ వచ్చేసరికి హౌస్ట్ నాగార్జున ఇతడికే సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా హౌసులోకి రావడానికి ముందే శివాజీ.. బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడేమో? అని డౌట్ ప్రేక్షకులకు కలుగుతోంది. అదే టైంలో హౌసులో గౌతమ్ తప్ప శివాజీతో ఏ ఒక్కరూ గొడవ పడటానికి ధైర్యం చేయట్లేదు. అందులో గౌతమ్, శివాజీకి కరెక్ట్ మొగుడిలా కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!)

మరిన్ని వార్తలు