లాక్‌డౌన్‌లో గృహహింస.. ఫిర్యాదులకు వాట్సప్

23 Apr, 2020 15:18 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై గృహహింస పెరుగుతోందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా మహిళలపై గృహహింస కేసులు పెరుగాయని జాతీయ మహిళా కమిషన్‌ కూడా తన నివేదికలో పేర్కొం‍ది. దీనితో పాటు లాక్‌డౌన్‌ సమయంలో సామాజికంగా, కుటుంబపరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్రంలో  గృహహింసపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ  దృష్టిపెట్టారు. లాక్‌డౌన్‌ సమయంలో మహిళల ఇబ్బందులకు గురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. దీని కోసం వాట్సప్‌ నెంబర్లను సైతం ఆమె ప్రజలకు అందుబాటులో ఉంచారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

లాక్‌డౌన్, కరోనా పరిస్థితులను మహిళలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా ఎదుర్కోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కుటుంబసభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మహిళలు మానసికంగా కుంగిపోకుండా కుటుంబసభ్యులు అండగా ఉండాలన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా హెల్ప్ డెస్క్‌కి సమాచారం ఇవ్వండని తెలిపారు. వాట్సాప్‌కు మెసెజ్ వచ్చిన వెంటనే స్పందిస్తామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.


అందుబాటులో హెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు..
9701056808 ,9603914511 

ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ :  6301411137

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు