బెజవాడ బస్టాండ్‌ ఆవరణలో ఆస్పత్రి ప్రారంభం

1 Jun, 2017 13:45 IST|Sakshi

విజయవాడ: నగరంలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన 30పడకల ఆస్పత్రిని గురువారం ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులతో పాటు కృష్ణా జిల్లాలోని ఆర్టీసీ కార్మికులకు ఈ ఆస్పత్రి ఉచిత సేవలందించనుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ.14కోట్లతో  విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు