ఉపాధి పోతే ఎలా?

8 Nov, 2014 01:07 IST|Sakshi
ఉపాధి పోతే ఎలా?

జిల్లాలో 2008లో జాతీయ ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదికి సుమారు రూ.200 కోట్లు చొప్పున ఇప్పటి వరకు రూ.1,200 కోట్ల పనులు జరిగాయి. ఇందులో ఏటా 1.50 లక్షల నుంచి 2.75 లక్షల మందికి వందరోజుల పనిదినాలు పనులు కల్పించారు. అలాగే మరో 40 వేల మంది వికలాంగులకు ఉపాధి కల్పించారు.
 

 సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ పాలనలో ప్రజలకు ఒక్కో పథకం దూరమవుతోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న అభివృద్ధి నిధులను సైతం దారి మళ్లించుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం దూరం కానుందని ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోయే జాబితాలో నెల్లూరుకు చోటు దక్కకపోవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

వలస నివారణ కోసం గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో వేలాది మంది ఉపాధి పొందేవారు. అయితే ఈ పథకాన్ని కేవలం కరువు పీడిత ప్రాంతాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ మేరకు ఆయా జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకున్నట్లు సమాచారం.

దేశ వ్యాప్తంగా 200 జిల్లాలను ఉపాధిహామీ పథకం నుంచి దూరం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఒకటని అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. అదే జరిగితే జిల్లాలో సగ భాగం ప్రాంతాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 నిరుపేద కుటుంబాలు రెండు లక్షలు
 జిల్లాలో సుమారు తొమ్మిది లక్షల కుటుంబాలు ఉంటే.. అందులో రెండు లక్షలకుపైగా నిరుపేద కుటుంబాలున్నాయి. మరో 2.50 లక్షలకు పైగా మధ్యతరగతి కుటుంబాలున్నాయి. ఇకపోతే జిల్లాలో సుమారు నాలగు లక్షల ఎకరాలకుపైగా వర్షాధారంపై ఆధారపడి ఉంది. ఉదయగిరి, వరికుంటపాడు, సీతారాం పురం, మర్రిపాడు, దగదర్తి, వెంకటగిరి, డక్కిలి, రాపూరు తదితర మండలా ల్లో వేసిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేదు.

కావలి పరిధిలో కాలువలు న్నా.. ప్రతి ఏటా నీరందక పంటలు ఎండిపోతున్నాయి. ఏటా పంటలు సాగు చేయడం, వర్షాలు లేక ఎండిపోవడం జరుగుతూనే ఉంది. దీంతో ఈ ప్రాంతా ల నుంచి వలసలు వెళ్లడం పరిపాటిగా మారింది. ఏటా కరువు పీడిత ప్రాంతా ల నుంచి సుమారు 20 వేల నుంచి 30 వేల మంది జనాభా వలసలు వెళ్తుం టారు. వీరంతా ఇతర ప్రాంతాల్లో ఇటుక బట్టీలు, తమలపాకులు కోసే పను ల్లో, ఇళ్ల నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుం టారు.

ఈ వలసల నివారణ కోసం ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారా ఉపాధి పొందేందుకు జిల్లాలో 5.20 లక్షల మందికి జాబ్‌కార్డులు ఇచ్చి ఉపాధి అవకాశం కల్పించింది. అయినా వలసలు మాత్రం ఆగలేదు.

 నివేదికల్లో ఏముంది?
 కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా నుంచి అధికారులు  నివేదిక ఏమని ఇచ్చారనేది తెలియరాలేదు. అయితే అధికారుల కొందరు జిల్లాలో ఆరు మండలాల్లో మాత్రమే కరువని నివేదిక పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నిజమైతే జిల్లాకు ఉపాధి హామీ పథకం దూరమయ్యే అవకాశం ఉందని కూలీలు ఆందోళన చెందుతున్నారు.

కేవలం ఆరు మండలాల కోసం జిల్లా అంతటా ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించే అవకాశం లేదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే జిల్లాలో సగభాగం మంది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోక తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు, అధికారులు స్పందిం చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ప్రచారం జరుగుతోన్న మాట వాస్తవం :  గౌతమి, డ్వామా పీడీ
 ఉపాధిహామీ పథకం నెల్లూరు జిల్లాకు ఉండదనే ప్రచారం వాస్తవమే. మాకు అధికారికం గా ఎటువంటి ఆదేశాలు అందలేదు. ప్రభుత్వం మాత్రం జిల్లా పరిస్థితులపై నివేదికలు అడిగిన మాట కూడా వాస్తవమే.

మరిన్ని వార్తలు