65 ఏళ్లు లేకపోతే వృద్ధాప్య పింఛన్ కట్

24 Sep, 2014 01:00 IST|Sakshi

కేంద్రం ఆదేశాలు ఏపీ సర్కార్ బేఖాతరు

హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల భారాన్ని భారీగా తగ్గించుకునేందుకు చంద్రబాబు  ప్రభుత్వం ఎత్తు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరిస్తూ పేదలకు వృద్ధాప్య పింఛన్ మంజూరుకు 65 సంవత్సరాల నిబంధనను పెట్టింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 సంవత్సరాల నుంచి పెన్షన్‌ను మంజూరు చేస్తూ మరోవైపు పేదల్లోని వృద్ధులకు మాత్రం 65 సంవత్సరాల నిబంధనల విధించడం ఎంతవరకు సమంజసం అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప పేదల్లోని వృద్ధుల పట్ల సానుభూతితో వ్యవహరించడం లేదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు